Brothers Fight For Shoe: పని మీద అమ్మమ్మ ఇంటికి వచ్చిన మనవడు ఊహించని స్థితిలో చనిపోయాడు. మేనమామల మధ్య జరిగిన గొడవలో మధ్యలో దూరిన మేనల్లుడు వారి చేతిలోనే హత్యకు గురయ్యాడు. షూ వేసుకుని అలాగే నిద్రపోయావనే విషయమై అన్నదమ్ముల మధ్య జరిగిన అంతటి దారుణానికి దారితీసింది. చుట్టపు చూపుగా వచ్చిన యువకుడు ఆఖరిచూపయ్యింది. చిన్న విషయం ఒక కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఈ విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Triangle Love: 'బేబీ' సినిమా కన్నా దారుణం.. ఇద్దరిని ప్రేమించి ఒకరిని చంపిన ప్రియురాలు


హైదరాబాద్‌లోని నిజాంపేటలో నివసిస్తున్న మార్త అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు సంగెపాగు ప్రవీణ్‌ మోజెస్‌ (20) కారు డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సెల్‌ఫోన్ రిపేరు కోసం ఈనెల 4వ తేదీన రహ్మత్‌నగర్‌ జవహర్‌నగర్‌లో ఉంటున్న వరుసకు అమ్మమ్మ అయిన రాణి ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఫిబ్రవరి 5న తన మేనమామలు అభిలాష్‌ అలెక్స్‌, అభిషేక్‌ అలెక్స్‌లతో (రాణి కుమారులు) కలిసి ఎర్రగడ్డకు వెళ్లారు. అక్కడ మొబైల్‌ ఫోన్‌ను బాగు చేయించుకుని ముగ్గురు రాత్రి 9.30 సమయంలో ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే బూట్లు కూడా విప్పకుండా తమ్ముడు అభిషేక్‌ గదిలోకి వెళ్లి బెడ్‌పై నిద్రపోయాడు. 

Also Read: Imran Khan: బతకడం కోసం లగ్జరీ కారును అమ్మేసుకున్న ఒకప్పటి స్టార్‌ హీరో


ఇది గమనించిన అన్న అభిలాష్‌ తమ్ముడికి షూ విప్పి నిద్రపోవాలని సూచించాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో అభిలాష్‌ తమ్ముడిని బలవంతంగా లేపాడు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ వాటిల్లింది. ఈ గొడవను ఆపేందుకు ప్రవీణ్‌ మోజెస్‌ ప్రయత్నించాడు. 'ఇంత చిన్న విషయానికి గొడవ పడలా?' అంటూ వారిద్దరిని విడిపించే ప్రయత్నం చేశాడు. మధ్యలో కల్పించుకున్న ప్రవీణ్‌పై అభిషేక్‌ అలెక్స్‌ కోప్పడ్డాడు. అయినా వినకపోవడంతో ఆవేశంలో ఉన్న అభిషేక్‌ వెంటనే వంట గదిలోకి వెళ్లి కత్తి తీసుకుని ప్రవీణ్‌ ఛాతీలో పొడిగాడు. బలంగా కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ప్రవీణ్‌ అపస్మారక స్థితికి వెళ్లాడు. 


వెంటనే కుటుంబసభ్యులు గ్రహించి ప్రవీణ్‌ను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అమీర్‌పేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపు ప్రవీణ్‌ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. చిన్న సంఘటన ఇంతటి దారుణానికి దారి తీయడంతో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతి చెందారు. మృతదేహాన్ని ప్రవీణ్‌ ఇంటికి తరలించారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న ప్రవీణ్‌ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అకారణంగా తన కుమారుడు మరణించాడని మృతుడి తల్లి మార్త తీవ్రంగా విలపించింది. క్షణికావేశంలో ఎంతటి దారుణాలు జరుగుతాయో తెలుసుకోండి. దీంతోపాటు గొడవ జరుగుతుంటే వారి మధ్య దూరితే మన మీదకే వస్తుందనే విషయాన్ని గ్రహించాలని సోషల్‌ మీడియాలో నెటిజన్లు చెబుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook