Boyfriend Pushes Her Girlfriend before train in Chennai: మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా.. కామాంధుల, ప్రేమోన్మాదుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా నిత్యం ఎదో మూల మహిళలపై అత్యాచారాలు, హత్యలు జారుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించలేదని 20 ఏళ్ల యువతిని రైలు కిందకు తోసేసి హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. యువతిని హత్య చేసిన అతడిని చెన్నై పోలీసులు అరెస్టు చేసారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నైలోని ఆదంబాక్కంకు చెందిన సత్యప్రియ (20) టీనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం రెండో ఏడాది చదువుతోంది. సత్యప్రియ 
 తండ్రి మాణిక్యం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తల్లి ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఆదంబాక్కం ప్రాంతానినే చెందిన సతీష్ (23)కు సత్యతో ఉంది. సతీష్ తన ప్రేమను తెలపగా.. సత్య ఇష్టం లేదని పలుమార్లు చెప్పింది. ఎన్నిసార్లు ప్రేమిస్తున్నట్లు తెలిపినా సత్య అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 13) కళాశాలకు వెళ్లేందుకు సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై సత్య ఉండగా.. సతీశ్‌ అక్కడికి వచ్చాడు.


ప్రేమ విషయంలో సత్య, సతీష్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో తాంబరం నుంచి ఎగ్మోర్ వైపు వెళ్తున్న లోకల్ ట్రైన్ కింద సత్యను తోసేశాడు. దీంతో సత్య అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. ఏడు బృందాలుగా విడిపోయి నిందితుడిని అరెస్టు చేశారు. వీరిద్దరి మధ్య ప్రేమ వివాదం నడుస్తోందని ఇరు కుటుంబాలకు తెలుసని సమాచారం తెలుస్తోంది. 


Also Read: టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌ రాణించలేడు.. టీమిండియాకు కష్టాలు తప్పవు: వసీం అక్రమ్‌


Also Read: Karva Chauth 2022: భార్య ఉపవాసం చేసిందని.. కత్తిపోట్లు పొడిచిన భర్త! చివరకు ఏమైందంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook