Actor Manoj Rajpur Molested Relative Girl: మహిళలు, అమ్మాయిలను మోసాలను అరికట్టడానికి ప్రభుత్వాలు అనేక కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. అయిన కూడా ఇప్పటికి కూడా మహిళలపై హింసలు మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజు ఎక్కడోఒక చోట మహిళలు వేధింపులకు గురౌతునే ఉన్నారు. గుడి, బడి, బస్టాండ్,చివరకు పోలీసు స్టేషన్ లలో కూడా మహిళల భద్రత పెనుసవాల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Betel Leaves: పరగడుపున తమలపాకులు తింటే కలిగే ఈ బెనిఫిట్స్ మీకు తెలుసా..?


కొందరు ఉద్యోగం పేరుతో, మరికొందరు సినిమాలో అవకావశాల పేరిట, బాధితమహిళల అవసనాలు ఆసరాగా చేసుకుని అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇప్పటికి చాలా చోట్ల మహిళలు దీనిపై పోరాటం చేస్తున్న కూడా.. అనేక చోట్ల ఇప్పటికి మహిళలు అఘాయిత్యాలు బైటపెట్టడానికి భయపడుతున్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 


పూర్తి వివరాలు..


ఛత్తీస్ గఢ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన మనోజ్ రాజ్ పూత్ తనకు దగ్గరి  బంధువైన ఒక యువతిపై గత 13 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా 29 ఏళ్ల మహిళ బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలోని తన కార్యాలయం నుంచి ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారి తెలిపారు.


"పెళ్లి సాకుతో 2011 నుంచి రాజ్‌పుత్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఓల్డ్ భిలాయ్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 22న పోలీసులకు ఫిర్యాదు అందింది.  పెళ్లిపేరుతో తనను శారీరంగా వాడుకున్నాడని మోసం చేసినట్లు యువతి ఫిర్యాదు చేసింది.  దీనిపై  స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) రాజ్‌కుమార్ బోర్జా విచారణ ప్రారంభించి, మనోజ్ రాజ్ పూత్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. 


Read More: Ashwini Sree Hot Reel Viral: సోషల్ మీడియాలో బిగ్ బాస్ బ్యూటీ ఫుల్‌ వైరల్‌.. హాట్‌ రీల్‌తో పిచ్చెక్కిస్తోంది!


అత్యాచారం, అసహజ లైంగిక వాంఛ, క్రిమినల్ బెదిరింపులు ఇతర నేరాలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద రాజ్‌పుత్‌పై అభియోగాలు మోపినట్లు సమాచారం.  అలాగే  బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటినుంచి అత్యాచారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు విచారణలో తెలింది. పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారి బోర్జా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది. 
 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook