Lottery Scam In Gudur: అత్యాశకు పోయి చేతిలో ఉన్న డబ్బులు పొగొట్టుకుంటున్నారు ఎందరో అమాయకులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిత్యం పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొందరు ఇంకా తెలుసుకోవడం లేదు. తమకు నిజంగా డబ్బులు వస్తాయమోనని భ్రమలో పడి.. అవతలి వ్యక్తి ఎవరు.. ఏంటి అని చూడకుండా ఉన్నకాడికి సమర్పించుకుంటున్నారు. తీరా మోసపోయాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా గూడురు పట్టణానికి చెందిన వ్యక్తి కూడా ఇలానే మోసపోయాడు. రూ.75 లక్షలు వస్తాయని ఆశపడి.. రూ.34 లక్షలు పొగొట్టుకున్నాడు. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఈ ఏడాది జనవరి నెలలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. 75 లక్షల రూపాయలు లాటరీ తగిలిందని గుడ్ న్యూస్ చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి తనకు లాటరీ తగిలిందని తెగ సంబరపడిపోయాడు. కానీ కొన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేయాల్సి ఉంటుందని ఆ అజ్ఞాత వ్యక్తి అన్నాడు.


ముందుగా ఆన్‌లైన్‌లో కొన్ని పేపర్లు తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తి.. మీకు డబ్బు సిద్ధం చేశామని త్వరలోనే మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందని నమ్మించాడు. మళ్లీ ఫోన్ చేసి మీ ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్‌ సమస్య వచ్చిందని.. రూ.5.75 లక్షలు చెల్లిస్తే క్లియర్ చేసి మీ అకౌంట్‌లో డబ్బులు వేస్తామన్నాడు. తన దగ్గర అంత డబ్బు లేదని బాధితుడు చెప్పగా.. 'కాస్త సమయం తీసుకుని అయినా పంపించండి.. మీరు గొప్ప అవకాశాన్ని కోల్పోవద్దు..' అంటూ కేటుగాడు చెప్పాడు. 


నకిలీ వ్యక్తి అడిగిన రూ.5.75 లక్షలు సిద్ధం చేసి.. అతను చెప్పిన ఖాతాలోకి బాధితుడు జమ చేశాడు. మళ్లీ కేటుగాడు ఫోన్ చేసి.. ఇన్‌కమ్ ట్యాక్స్ క్లియర్ అయిందని.. జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుందన్నాడు. అప్పుడు కూడా కొంత డబ్బు వేశాడు. ఆ ఫీజు.. ఈ ఫీజు అంటూ దఫదఫాలుగా దాదాపు 34 లక్షల రూపాయలను దుండగుడు చెప్పిన అకౌంట్‌లోకి బాధితుడు పంపించాడు. ఈ వ్యవహారం పది నెలలుగా కొనసాగింది. 


అయినా తనకు రావాల్సిన రూ.75 లక్షలు రావడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. మంగళవారం గూడురు పోలీసులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. సైబర్‌ క్రైమ్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


లాటరీ కట్టకుండానే తనకు ఎలా డబ్బు వస్తుందో తెలుసుకోకుండా బాధితుడు లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని మనం నిత్యం టీవీ యాడ్స్‌లో చూస్తునే ఉన్నాం. మీకు ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాల్లోకి అస్సలు డబ్బులు వేయవద్దు. అప్రమత్తంగా ఉండండి.. సైబర్ నేరాలకు దూరంగా ఉండండి..


Also Read: Munugode By-Elections: మునుగోడులో బీజేపీ ఓటమి బాధ్యత నాదే.. జేపీ నడ్డాకు బండి సంజయ్ లేఖ రాశారట.. ఇదేం పంచాయితీ..!  


Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి