Munugode By-Elections: మునుగోడులో బీజేపీ ఓటమి బాధ్యత నాదే.. జేపీ నడ్డాకు బండి సంజయ్ లేఖ రాశారట.. ఇదేం పంచాయితీ..!

Bandi Sanjay Letter Viral: మునుగోడు పోలింగ్‌కు సమయం దగ్గపడుతున్న వేళ ఓ లేఖ బీజేపీలో కలకలం రేపింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేరు మీద లెటర్ వైరల్ అయింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2022, 07:10 AM IST
Munugode By-Elections: మునుగోడులో బీజేపీ ఓటమి బాధ్యత నాదే.. జేపీ నడ్డాకు బండి సంజయ్ లేఖ రాశారట.. ఇదేం పంచాయితీ..!

Bandi Sanjay Letter Viral: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రచార పర్వం ముగియడంతో.. ఇక అందరూ గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా.. గెలుపు తమదంటే తమదంటూ అన్ని పార్టీలు ధీమాగా చెబుతున్నాయి. ఇక పోలింగ్‌ కు కొన్ని గంటల సమయం ఉండగా.. ఓ లేఖ బీజేపీలో కలకలం రేపుతోంది.

మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ముందే గ్రహించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఓటమి తనదే బాధ్యత అని ఒప్పుకున్నారట. ఈ మేరకు లేఖను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది. బండి సంజయ్ లెటర్ ప్యాడ్‌తో ఉన్న ఆ లేఖ ప్రకంపనలు రేపుతోంది. అక్టోబర్ 31న బండి సంజయ్ లేఖ రాసినట్లు ఉంది. 

వైరల్ అవుతున్న ఈ లెటర్‌పై బండి సంజయ్ స్పందించారు. 'ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఫామ్‌హౌస్ డ్రామా ఫ్లాప్ కావడంతో.. టీఆర్ఎస్ మోసగాళ్లు ఇప్పుడు నకిలీ లేఖను విడుదల చేశారు. మునుగోడులో బీజేపీ రికార్డు విజయాన్ని సాధిస్తుంది. నవంబర్ 3న టీఆర్ఎస్ అబద్దాల ప్రయాణం ముగుస్తుంది. ఇది కేసీఆర్ ప్రజా జీవితానికి నిజమైన రాజీనామాకు దారి తీస్తుంది. టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయి..' అంటూ ఆయన ట్వీట్ చేశారు. వైరల్ అవుతున్న లేఖ ఫేక్ అని కొట్టి పారేశారు. 

 

మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే బండి సంజయ్ రాజీనామా చేస్తారని ఇప్పటికే పుకార్లు రాగా.. ఇప్పుడు ఈ లేఖ ఆ పుకార్లకు మరింత బలాన్ని చేకుర్చింది. లేఖలో రాజీనామా గురించి ప్రస్తావించలేదు గానీ.. మునుగోడు ఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్లు బండి సంజయ్ పేరు మీద కొందరు ఫేక్ రాయుళ్లు ముందే లేఖను క్రియేట్ చేశారు. 

ఈ ఫేక్ లెటర్ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి, పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ పేరు మీద ఇతర పార్టీలకు చెందిన నేతలు తప్పుడు లేఖలు రాసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఓటమి భయంతో ఇలా చేస్తున్నారని అన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..!  

Also Read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News