Wanaparthy Murder: కూతురి ప్రేమ వ్యవహారం.. దారుణంగా హత్య చేసిన తండ్రి
Father Kills Daughter: కూతురి ప్రేమవ్యవహారం తండ్రికి తెలిసింది. కుటుంబం పరువు పోతుందని.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో దారుణంగా హత్య చేశాడు.
Father Kills Daughter: కన్న బిడ్డను కళ్లలో పెట్టుకోని చూసుకోవాల్సిన తండ్రే కాల యముడయ్యాడు. కూతురి ప్రేమ వ్యవహరం తెలిసి.. దారుణంగా గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కలకలం రేపింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. వివరాలు ఇలా..
పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, సునీత దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. రెండో అమ్మాయి గీత (15) పెబ్బేరులోని జడ్పీ బాలికల హైస్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని గీత ప్రేమిస్తుందనే విషయం రాజశేఖర్‌కు తెలిసింది.
ప్రేమవ్యవహారంపై కూతురిని పలుమార్లు ఆయన హెచ్చరించాడు. కుటుంబం పరువు పోతుందని.. మంచిగా చదువుకోవాలని నచ్చజెప్పాడు. కుటుంబం అంతా దీపావళికి అమ్మమ్మ ఊరైన వనపర్తి మండలం చందాపూర్‌కు వెళ్లి.. సోమవారం సాయంత్రానికి తిరిగి పాతపల్లికి వచ్చారు.
సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన గీత.. ఆలస్యంగా ఇంటికి వచ్చింది. దీంతో ఎందుకు ఇలా చేస్తున్నావంటూ గీతను తండ్రి కొట్టాడు. మంగళవారం ఉదయం రాజశేఖర్ పొలం పనులకు వెళ్లగా.. మరో కూతురు, కుమారుడు బయటకు వెళ్లారు. మరోసారి గీతకు రాజశేఖర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో కోపోద్రిక్తుడైన రాజశేఖర్ కూతురు గీతపై గొడ్డలితో దాడి చేశాడు. ఏకంగా 8 సార్లు గొడ్డలితో వేటు వేయడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. రక్తపుమడుగులో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కూతురిని హత్య చేసి రాజశేఖర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. క్లూస్ టీంతో వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్లు డీఎస్పీ ఆనంద్‌రెడ్డి తెలిపారు. గీత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Also Read: Pawan Kalyan: పవన్‌ను సీఎంగా ప్రకటిస్తే పొత్తుకు ఓకే! చంద్రబాబుకు బీజేపీ పెద్దల ఆఫర్?
Also Read: Mobile Charging: దుస్తులతో మొబైల్ ఛార్జింగ్.. ఎలాగో తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి