Siblings Died: ఘోర సంఘటన.. సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ నలుగురు చిన్నారులు మృతి
Siblings Die In Fire In Meerut: చిన్న పొరపాటు నలుగురి చిన్నారుల ప్రాణాలు తీసింది. సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతున్న సమయంలో జరిగిన ప్రమాదంతో ఆ చిన్నారులు కాలిబూడిదయ్యారు. ఈ ఘోర సంఘటన అందరినీ కలచివేస్తోంది.
Short Circuit: ఎలక్ట్రిక్ ఉత్పత్తులకు చిన్నారులను దూరంగా ఉంచకుంటే ఎంతటి ఘోర ప్రమాదాలకు దారి తీస్తుందో ఈ సంఘటనే చెబుతోంది. సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టుముట్టడంతో నలుగురు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. నాలుగు కుటుంబాల్లో సెల్‌ఫోన్ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Doctor Kicked: డాక్టరా వీధిరౌడీనా.. ఆస్పత్రిలో పేషెంట్‌ను తన్నితరిమిన వైద్యుడు
మీరట్ జిల్లా పల్లవపురంలోని జనతా కాలనీకి చెందిన జానీ(47), బబిత (37) దంపతులకు నలుగురు సంతానం. వారి పేర్లు సారిక (10), నిహారిక (8), సంస్కార్ (6), కాలు (4). ఆ చిన్నారులు శనివారం రాత్రి మొబైల్ ఫోన్‌లో ఆడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈత సమయంలో ఒక్కసారిగా స్విచ్ బోర్డు నుంచి మంటలు వచ్చాయి. ఆ మంటు బెడ్‌షీట్‌కు అంటుకోవడంతో ఒక్కసారిగా ఇల్లు మొత్తం వ్యాపించాయి. ఒక్కసారిగా చుట్టుముట్టిన మంటల నుంచి నలుగురు చిన్నారులు తప్పించుకోలేకపోయారు. ఆర్తనాదాలు చేస్తూ మంటలకు ఆహుతి అయిపోయారు.
Also Read: Wine Shops: మందుబాబులకు వెరీ బ్యాడ్ న్యూస్.. వైన్స్, బార్లు, పబ్‌లు బంద్
అయితే పిల్లలను కాపాడే ప్రయత్నంలో తల్లిదండ్రులు జానీ, బబితకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు వచ్చి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. ఈ వార్త అందరినీ కలచివేస్తోంది. అభంశుభం తెలియని పిల్లలు పొరపాటుగా జరిగిన ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఎలక్ట్రిక్ ఉత్పత్తులకు చిన్నారులకు దూరంగా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. స్విచ్ బోర్డుల వద్దకు వెళ్లనీయవద్దని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి