Ahinaya Cheating: నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది.. ఐదో పెళ్ళికి సిద్ధమవుతుండగా ఇలా దొరికేసింది!
Fraudster Woman Cheating Men arrested: ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి ఆ తరువాత నలుగురిని మోసం చేసి వారివద్ద నుంచి డబ్బు, నగలు దోచుకుని ఇప్పుడు ఐదో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన ఒక కిలాడీ లేడీ అరెస్ట్ అయింది. ఆ వివరాలు
Fraudster Woman Cheating Men with marriage arrested in Chennai: సాధారణంగా వార్తల్లో ఎక్కువగా నిత్య పెళ్లికొడుకుల గురించి చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు తమిళనాడులో వరుస పెళ్లిళ్లు చేసుకుంటున్న నిత్య పెళ్లి కూతురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని నలుగురు భర్తలను ముంచేసి ఐదో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న క్రమంలో ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.
తాజాగా తమిళనాడు చెన్నైకి చెందిన అభినయ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని నలుగురిని ముంచేసిన ఆమె ఐదో పెళ్ళికి సిద్ధమవుతున్న సమయంలో నాలుగో భర్త చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం విలాసవంతమైన జీవితం కోసమే నలుగురు యువకులను ప్రేమించి పెళ్ళాడి నెల కూడా తిరగకముందే వారి దగ్గర ఉన్న నగలు, డబ్బుతో ఆమె ఎస్కేప్ అవుతూ ఉంటుందని పోలీసులు తేల్చారు.
చూస్తేనే సినిమా ఫక్కీలా అనిపిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో ఒక కీలక పొజిషన్ లో పనిచేస్తున్న తాంబరం రంగనాథ పురానికి చెందిన నటరాజన్ అనే వ్యక్తికి అభినయ తనను తాను ఒక అనాధగా పరిచయం చేసుకుంది. ఆమెతో ప్రేమలో పడిన నటరాజన్ ఆగస్టు 29వ తేదీన వివాహం కూడా చేసుకున్నాడు. సరిగ్గా పెళ్లైన నెల రోజులకు అభినయ నగలు డబ్బుతో పారిపోయింది.
దీంతో తాంబరం పోలీసులకు నటరాజ్ ఫిర్యాదు చేశాడు. నటరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించి ఆమెను ట్రేస్ చేసి 32 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదటి నలుగురి భర్తల నుంచి దోచుకున్న డబ్బు నగలలో ఒక రూపాయి కూడా లేకుండా విలాసాలు టూర్ల కోసం ఆమె ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఐదవ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆమెను పట్టేశారు పోలీసులు. దీంతో ఈ వరుస పెళ్లిళ్ల భాగోతం బయటపడింది.
Also Read: Hindu Girls Marriage Age: హిందూ అమ్మాయిల పెళ్లి, సంతాన యోగంపై ముస్లిం ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read: Viral Leave Letter: మా అమ్మ 5న చనిపోతది.. సెలవులు కావాలి! వైరల్ అవుతోన్న టీచర్స్ లీవ్ లెటర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook