Attack On Aftab Poonawalla: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌పై హిందూ సేన సభ్యులు కత్తితో దాడికి యత్నించారు. పాలిగ్రాఫ్ పరీక్ష అనంతరం ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం అఫ్తాబ్‌తో కలిసి బయటకు వచ్చింది. అప్పటికే అక్కడు వేచిఉన్న కొంత మంది వ్యక్తులు.. అఫ్తాబ్‌ ప్రయాణిస్తున్న పోలీసు వాహనంపై దాడి చేశారు. కత్తులతో వాహనం ముందుకు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులపై కూడా దాడికి యత్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో పోలీసులు కాస్త వెనక్కి వెళ్లగా.. వెంటనే అఫ్తాబ్ ఉన్న వ్యాన్ తలుపులు తెరిచారు. సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఇలాంటి దుర్మార్గుల వల్ల దేశంలో అక్కాచెల్లెళ్లు, కూతుళ్లకు భద్రత లేదని అంటూ దాడికి పాల్పడ్డారు. శ్రద్ధాను 35 ముక్కలుగా చేసిన అఫ్తాబ్‌ను 70 ముక్కలు చేస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు వెంటనే తెరుకుని దాడికి యత్నించిన వారిపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. 


దీంతో ఆగ్రహించిన వారు పోలీసు వ్యాన్‌పై కూడా రాళ్లు విసిరారు. రెండు నిమిషాలు బయటికి టైమ్ ఇవ్వండి.. అఫ్తాబ్‌ను చంపేస్తా అంటూ అందులోని ఓ వ్యక్తి అన్నాడు. అఫ్తాబ్ వ్యాన్‌పై దాడి చేసిన కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  


అఫ్తాబ్ రోహిణి ఎఫ్‌ఎస్‌ఎల్‌లో పాలిగ్రాఫ్ పరీక్ష చేయించుకున్నాడు. ఆ తర్వాత పోలీసు బృందం అతనితో తిరిగి వెళుతోంది. ఈ సమయంలోనే కొందరు వ్యక్తులు పోలీసు వ్యాన్‌పై దాడి చేశారు. అంతకుముందు ఎఫ్‌ఎస్‌ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా మాట్లాడుతూ.. నిపుణుల బృందం పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహిస్తోందని, ఈ రోజు సెషన్ పూర్తవుతుందని చెప్పారు. అవసరమైతే రేపు కూడా అఫ్తాబ్‌ని ఈ పరీక్షకు పిలుస్తామన్నారు. పాలిగ్రాఫ్ పరీక్ష ముగిసిన తర్వాత నార్కో పరీక్ష ప్రారంభమవుతుంది. 


Also Read: IND Vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. ఈ ముగ్గురు సీనియర్లకు కోచింగ్ బాధ్యతలు  


Also Read: MLA Jagga Reddy: నేను ఏది మాట్లాడినా వివాదమే.. ఈ బురద నాకెందుకు.. జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook