IND Vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. ఈ ముగ్గురు సీనియర్లకు కోచింగ్ బాధ్యతలు

India A Tour Of Bangladesh: కివీస్ టూర్‌ తరువాత టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 07:20 PM IST
IND Vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. ఈ ముగ్గురు సీనియర్లకు కోచింగ్ బాధ్యతలు

India A Tour Of Bangladesh: ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఈ సిరీస్‌ తరువాత బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు జట్టుతో చేరనున్నారు. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. అదేసమయంలో టీమిండియా ఎ జట్లు ప్రస్తుతం బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉంది. ఈ జట్టుకు బీసీసీఐ కోచింగ్‌ స్టాఫ్‌ని ప్రకటించింది. ఈ టూర్‌లో బంగ్లాదేశ్‌తో టీమిండియా నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన జట్టును ఇప్పటికే ప్రకటించారు. 

ఈ ముగ్గురు అనుభవజ్ఞులను కోచ్‌లుగా..

రెండు నాలుగు రోజుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ఇండియా ఎ జట్టుకు కోచింగ్ బాధ్యతలను సౌరాష్ట్ర మాజీ కెప్టెన్ సితాన్షు కోటక్‌కు అప్పగించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో బ్యాటింగ్ కోచ్‌లలో ఆయన ఒకరు. సితాన్షు కోటక్‌కి ట్రాయ్ కూలీ, టీ.దిలీప్ సహాయం చేస్తారు. దిలీప్ సీనియర్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ క్యాంపెయిన్ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ మంగళవారం (నవంబర్ 29) నుంచి ప్రారంభం కానుంది. 

దిలీప్ టీమ్ ఇండియా ఏ జట్టుతో కలిసి పర్యటిస్తారు. ఆ తరువాత బంగ్లాదేశ్‌తో ఛటోగ్రామ్‌లో డిసెంబర్ 14 నుంచి 18 వరకు, ఢాకాలో డిసెంబర్ 22 నుంచి 26 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న సీనియర్ జట్టుతో చేరతారు. వీవీఎస్ లక్ష్మణ్, అతని సహాయక సిబ్బంది హృషికేష్ కనిట్కర్, సాయిరాజ్ బహుతులే ప్రస్తుతం న్యూజిలాండ్‌లో సీనియర్ భారత జట్టుతో కలిసి ఉన్నందున కోచింగ్ సిబ్బందిలో మార్పు అనివార్యమైంది.

బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు టీమ్ ఇండియా ఎ జట్టు:

తొలి మ్యాచ్‌కు జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమల్, యశస్వి జైస్వాల్, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ మరియు అతిత్ సేథ్.

రెండో మ్యాచ్‌కు జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), రోహన్ కున్నుమల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, చతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్, అతిత్ సేథ్.

Also Read: MLA Jagga Reddy: నేను ఏది మాట్లాడినా వివాదమే.. ఈ బురద నాకెందుకు.. జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్  

Also Read: Minister Roja: బ్యాట్ పట్టిన మంత్రి రోజా.. అచ్చం క్రికెటర్‌లానే..   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News