హనీట్రాప్ కేసు ఇప్పుడు దక్షిణాదికి కూడా విస్తరించింది. ఈ హనీట్రాప్ టెర్రరిస్టు కార్యకలాపాలకు సంబందించి కాదు. అవినీతి, బ్లాక్ మెయిలింగ్ సామ్రాజ్యానికి సంబంధించింది. ఒడిశా నుంచి ఏపీకు విస్తరించింది. ఒడిశా ఒగలాడి సెగ ఇప్పుడు రైల్వే శాఖకూ వ్యాపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా జలేశ్వర్‌కు చెందిన అర్చన్ నాగ్ ఈమె. లేడీ బ్లాక్ మెయిలర్‌గా నేర జీవితంలో చాలా దశలు దాటేసింది. భర్త జగబంధుతో కలిసి వివిధ నేరాలు చేసింది. అందం, హొయలు చూపించి వలలో వేయడం, సీక్రెట్ కెమేరాతో చిత్రీకరించి బ్లాక్ మెయిలింగ్ చేయడం ఇదీ ఆమె ప్రవృత్తి. మొన్నటివరకూ ఓ ప్రాంతానికే పరిమితమైన ఒడిశా ఒగలాడి అర్చనా నాగ్ భాగోతం ఇప్పుడు ఒక్కసారిగా ప్రాచుర్యంలో వచ్చింది. 


రాజకీయ నాయకులు, సినీ నిర్మాతలు, వ్యాపారవేత్తలతో సహా పెద్ద పెద్ద ఉద్యోగుల్ని కూడా టార్గెట్ చేస్తోంది. ఈమె హనీట్రాప్ వ్యవహారం ఇప్పుడు ఒడిశా దాటి ఏపీలోని విశాఖపట్నంకు విస్తరించింది. విశాఖపట్నం పరిధిలోని వాల్తేర్ రైల్వే డివిజన్ డీఆర్ఎం అనూప్ సత్పతి సైతం ఈమె హానీట్రాప్‌లో చిక్కుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సాక్ష్యంగా వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్ సత్పతి, అర్చనా నాగ్‌చంద్, భర్త జగబంధు కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది. 


మరోవైపు రైల్వే టెండర్లలో అవకతవకలు జరిగాయని, అవీనితి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ల అవినీతికి అర్చనా నాగ్‌చంద్‌తో డీఆర్ఎం ఫోటోకు సంబంధముందా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు అర్చనా నాగ్‌చంద్‌ను ఇటీవల ఒడిశా పోలీసులు అరెస్టు చేయడంతో..వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్ సత్పతి సెలవుపై వెళ్లడం కూడా సందేహాల్ని పెంచుతోంది.


Also read: Uttar pradesh: ప్రజల నేతాజీ, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు తుది వీడ్కోలు పలికిన కేసీఆర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook