ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ దురంధరుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చిన అభిమానుల అశ్రు నయనాల మధ్య మహానేతకు తుది వీడ్కోలు పలికారు.
యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్..ములాయం సింగ్ యాదవ్ స్వస్థలం యూపీలోని ఇటావా జిల్లా సైఫై గ్రామానికి వాయుమార్గంలో చేరుకున్నారు. అనంతరం ములాయం సింగ్‌ను కడసారి దర్శించుకునేందుకు చేరుకున్న లక్షలాది జనసమూహాన్ని దాటుకుని పార్ధీవదేహం వద్దకు కేసీఆర్ చేరుకున్నారు. శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు.
ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబసభ్యుల్ని పలకరించి..సానుభూతి తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ములాయం కుమారుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కౌగిలించుకుని ఓదార్చారు. దేశం గర్వించదగిన గొప్ప నేత ములాయం సింగ్ యాదవ్ అని కేసీఆర్ కీర్తించారు.
అక్కడి నేరుగా ఢిల్లీకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డ వంటి నేతలున్నారు.
Also read: Mulayam singh CM KCR: ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook