Old City Murder Case: హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ కార్పొరేటర్ మేనల్లుడి హత్య కలకలం రేపుతోంది. సోమవారం పట్టపగలు దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. మృతుడిని లలిత్‌బాగ్ ఏఐఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ అల్లుడు సయ్యద్ ముర్తుజా అన్సారీగా గుర్తించారు. తన మామ కార్పొరేటర్ కార్యాలయంలో అన్సారీ ఉన్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి పారిపోయారు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో ఉన్న అన్సారీని స్థానికులు వెంటనే ఓవైసీ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. హత్య గల కారణాలను ఆరా తీస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇద్దరు వ్యక్తులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఐదు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం. సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణాధికారులకు సూచనలు చేశారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 


 




ముర్తుజా అన్సారీ బంజారాహిల్స్‌లోని అన్వర్ ఉలుం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అన్సారీ కార్పొరేటర్ కార్యాలయంలో ఉన్నాడని పక్కా సమాచారంతో ఇద్దరు వ్యక్తులు కత్తులతో వచ్చి దాడి చేశారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ ఓవైసీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కార్పొరేటర్ ఆఫీసు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానికులను విచారించడంతోపాటు.. సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు విచారణలో వెల్లడికానున్నాయి.


Also Read: LPG Gas Cylinder: రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ముఖ్యమంత్రి సంచలన ప్రకటన  


Also Read: MP Salary In India: మీ ఎంపీ జీతం ఎంతో తెలుసా.. ప్రతి నెల సంపాదన ఎంతంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook