MP Allowance: ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఓటింగ్ ద్వారా మీ పార్లమెంటు సభ్యుడిని ఎన్నుకుంటారు. గెలిచిన వ్యక్తి లోక్‌సభలో మీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఎన్నికైన ఎంపీ మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలను లోక్‌సభలో ప్రస్తావిస్తారు. అంతేకాకుండా తన ప్రత్యేక నిధుల లోక్‌సభ పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తారు. మరీ ఈ పనులన్నీ చేసినందుకు ఎంపీకి నెలనెలా ఎంత జీతం వస్తుంది..? ఎలాంటి అలవెన్స్‌లు పొందుతున్నారో తెలుసా..
ప్రతి ఎంపీకి నెలకు రూ.లక్ష ప్రాథమిక వేతనంగా లభిస్తుంది. దీంతో పాటు ఆఫీసు అలవెన్స్‌గా రూ.54 వేలు, నియోజకవర్గ భత్యం కింద రూ.49 వేలు ఇస్తారు. ఈ విధంగా ప్రతి నెలా ఎంపీకి దాదాపు రూ.2 లక్షల వరకు స్థిర వేతనం వస్తుంది. అంతేకాకుండా ఇతర ప్రోత్సాహకాలు, సౌకర్యాలు కూడా ఉంటాయి.
ప్రత్యక్ష బకాయిలుగా ఏటా రూ.3 లక్షల 80 వేలు, విమాన ప్రయాణ భత్యం కింద ఏటా రూ.4 లక్షల 8 వేలు, రైలు ప్రయాణ భత్యం రూ.5 వేలు, వాటర్ అలవెన్స్, విద్యుత్ అలవెన్స్ కింద ఏటా రూ.4 వేలు, ఇతర అలవెన్సుల కింద ఏటా 4 లక్షల రూపాయలు వస్తాయి. ప్రతి ఎంపీ ఏడాదికి రూ.36 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు.
జీతంపై పన్ను లేదు
ఎంపీ జీతంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. వారి జీతంపై పన్ను లేదు. ఇది కాకుండా.. నివసించడానికి ప్రభుత్వ బంగ్లా కూడా అందుబాటులో ఉంది. బంగ్లాకు ఫర్నీచర్, ఏసీ, మెయింటెనెన్స్‌కు కూడా వారు చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read: MLA Saroj Babulal Ahire: రెండు నెలల బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Also Read: PF Account: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇలా అస్సలు చేయకండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి