Suicide By Cutting off His Penis: షాకింగ్ న్యూస్.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ స్టూడెంట్ సూసైడ్
Suicide By Cutting off His Penis: సాధారణంగా ఆత్మహత్యకు పాల్పడే ఏ వ్యక్తి అయినా తనని తాను అతి కిరాతకంగా హింసించుకునే ధైర్యం చేయలేరు. చస్తూ చస్తూ చచ్చే ముందు శారీరకంగా, మానసింగా కలిగే ఆ నొప్పిని ఎవ్వరూ భరించలేరు. అయినప్పటికీ ఈ ఘటనలో యువకుడు తన పురుషాంగాన్ని కోసుకుని మరీ ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
Suicide By Cutting off His Penis : హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్య సాధారణ పద్దతిలో కాకుండా అసాధారణ పద్ధతిలో, ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఆ యువకుడు తన పురుషాంగాన్ని కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన తీరు తీవ్ర కలకలం సృష్టించింది. జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డి నగర్ రోడ్ నెంబర్ 18 లో ఈ ఘటన చోటుచేసుకుంది. పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని దీక్షిత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. దీక్షిత్ రెడ్డి తను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
యువకుడు తన పురుషాంగాన్ని కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీక్షిత్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. యువకుడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఆత్మహత్యేనా లేక ?
సాధారణంగా ఆత్మహత్యకు పాల్పడే ఏ వ్యక్తి అయినా తనని తాను అతి కిరాతకంగా హింసించుకునే ధైర్యం చేయలేరు. చస్తూ చస్తూ చచ్చే ముందు శారీరకంగా, మానసింగా కలిగే ఆ నొప్పిని ఎవ్వరూ భరించలేరు. అయినప్పటికీ ఈ ఘటనలో యువకుడు తన పురుషాంగాన్ని కోసుకుని మరీ ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పైగా ఇలాంటి ఆత్మహత్య కేవలం ఆత్మహత్యగానే కాకుండా సమాజంలో ఎన్నో అనుమానాలకు, ప్రచారాలకు తావిచ్చే అవకాశం కూడా ఉంటుంది. మెడిసిన్ చదువుతున్న విద్యార్థి అయిన దీక్షిత్ ఇవన్ని తెలియని యువకుడు కాదు. ఇవన్నీ తెలిసి కూడా ఈ విధంగా ఆత్మహత్య చేసుకునే సాహసం ఎవ్వరూ చేయరు. ఇలాంటి ఘటనలు గతంలో జరిగినప్పటికీ అవి చాలా అరుదు అనే చెప్పుకోవాలి. అలాంటప్పుడు అసలు ఇది ఆత్మహత్య అనే అనుకోవచ్చా లేక ఈ ఘటన వెనుక ఇంకా బయటికి రాని కోణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ హత్య అయితే ?
ఒకవేళ ఇది ఆత్మహత్య కాదు... హత్యే అయ్యుంటుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ కోణంలో పరిశీలించినట్టయితే.. గతంలో ఇలా పురుషాంగం కోసి హత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి వివాహేతర సంబంధాలు కలిగి ఉన్న కేసుల్లో లేదా వివాహేతర సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతోనే ఇలా పురుషాంగం కోసి హత్యకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ ఘటనలో కూడా అలాంటి కోణం ఏదైనా ఉండి ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అలాంటి కోణమే ఉండి ఉంటే.. ఆ హత్య చేసిన వారే దీనిని ఆత్మహత్యగా చూపించే కుట్ర చేశారా అని అనుమానం వ్యక్తంచేస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఏదేమైనా ఎంబిబిఎసీ చదువుతున్న యువకుడు మృతి చెంది కనిపించడం వెనుక అసలేం జరిగింది అనేది పోలీసుల విచారణలోనే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : Child Marriage News: 13 ఏళ్ల బాలికతో 45 ఏళ్ల వ్యక్తికి పెళ్లి.. అర్ధరాత్రి అరాచకం
దీక్షిత్ మనస్తత్వం ఎలాంటిది ?
చనిపోయిన దీక్షిత్ మనస్తత్వం ఎలాంటిది ? అతడి మానసిక పరిస్థితి ఎలా ఉండేది ? అతడికి ఆత్మహత్య చేసుకునేంత కారణాలు ఏమైనా ఉన్నాయా ? ఒకవేళ ఉన్నా.. మరీ ఇంత దారుణంగా ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సినంత దుస్థితి ఎందుకు వచ్చింది ? దీక్షిత్‌కి ఎవరైనా శత్రువులు ఉన్నారా ? గత కొద్ది రోజులుగా దీక్షిత్ వైఖరి ఎలా ఉంటోంది ? ఏదైనా ఆందోళనలో ఉన్నట్టు కనిపించాడా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Teacher Eloped With Student: విద్యార్థినితో టీచరమ్మ లైంగిక సంబంధం, అదృశ్యం.. అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK