Hyderabad: హైదరాబాద్‌లో దారుణం... పిల్లల ఎదుటే భార్య గొంతు కోసి చంపిన భర్త
Hyderabad Murder Case: దివ్యభారతి ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండగా, దీపక్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లు పాటు వీరి కాపురం సాఫీగానే సాగినప్పటికీ దీపక్ అదనపు కట్నం వేధింపులతో గొడవలు మొదలయ్యాయి.
Hyderabad Murder Case: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పిల్లల ఎదుటే తన భార్య గొంతు కోసి హత్య చేశాడు. 10 రోజులుగా ఇంటికి దూరంగా ఉన్న అతను.. శుక్రవారం రాత్రి ఇంటికొచ్చాడు. అర్ధరాత్రి సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొన్నాళ్లుగా అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న అతను ఆమెపై అనుమానం కూడా పెంచుకున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి చెందిన కంది దివ్య భారతి (33)కి హైదరాబాద్ అంబర్‌పేట్‌కి చెందిన పుస్తకాల దీపక్ (40) అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు కుటుంబం దీపక్‌కి భారీగానే కట్నకానుకలు అందించింది. పెళ్లి తర్వాత దివ్య భారతి-దీపక్‌లు ఉప్పల్‌లోని కురుమనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
దివ్యభారతి ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుండగా, దీపక్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లు పాటు వీరి కాపురం సాఫీగానే సాగినప్పటికీ దీపక్ అదనపు కట్నం వేధింపులతో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం దివ్యభారతి భర్తపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దివ్యభారతి, దీపక్‌లకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినప్పటికీ దీపక్ ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఇదే క్రమంలో దీపక్ గత 10 రోజులుగా ఇంటికి దూరంగా ఉన్నాడు. శుక్రవారం (ఆగస్టు 20) రాత్రి ఇంటికొచ్చిన అతను అర్ధరాత్రి సమయంలో భార్య దివ్యభారతిపై దాడి చేశాడు. పిల్లలు చూస్తుండగానే కత్తితో ఆమె గొంతు కోసేశాడు. పిల్లల అరుపులకు చుట్టుపక్కలవారు పరిగెత్తుకొచ్చారు. అప్పటికే దివ్యభారతి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దీపక్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దీపక్‌పై దివ్య భారతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దీపక్‌కి గతంలో మరో అమ్మాయితో పెళ్లి జరగ్గా.. ఆడపిల్ల పుట్టిందని వదిలేశాడన్నారు. ఆ తర్వాత తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దివ్యభారతి హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook