Teacher Romance With Student: స్టూడెంట్ తో టీచర్ రొమాన్స్.. ఆపై ధమ్కీ.. ఆ చాటింగ్స్ చూస్తే తట్టుకోలేరు..
Indore pharma student news: టీచర్ ఫార్మా స్టూడెంట్ తో ప్రేమాయణం సాగించింది. కొన్ని రోజులు పాటు వీరిద్దరి యవ్వారం బాగానే సాగింది. ఏమైందో కానీ లేడీ టీచర్ యువకుడ్ని బెదిరింపులకు గురిచేసంది. దీంతో అతను షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
Indore pharma student romance with lady teacher boy commits suicide: ఇటీవల కాలంలో కొంత మంది ఉపాధ్యాయులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. పవిత్రమైన తమ వృత్తికే చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. స్కూల్స్, కాలేజీలు, యూనీవర్సీటీలలో కొంత మంది టీచర్లు, లెక్చరర్లు కామాంధులుగా మారిపోయారు. అమ్మాయిల్ని వేధింపులకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా.. అత్యాచారాలకు కూడా తెగబడుతున్నారు. తమకు లొంగకుంటే.. భవిష్యత్తు ఉండదంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు భయంతో, తమ టీచర్ దారుణాలు బైటకు చెప్పడం లేదు.
కానీ మరికొందరు మాత్రం.. సీక్రెట్ గా తమపైన జరిగిన దారుణాలను చెప్తున్నారు.దీంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. కొన్ని చోట్ల టీచర్ లు వేధింపులకు గురిచేసి వీడియోలు రికార్డు చేసుకుని, వాటిని చూపిస్తు, డబ్బులు,తాము పిల్చినప్పుడు వచ్చి తమ కోరిక తీర్చాలంటూ కూడా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇక్కడ ఒక కిలేడీ టీచర్ దారుణాలకు పాల్పడింది. ఏకంగా తన స్టూడెంట్ తో ప్రేమాయణం సాగించింది.
పూర్తివివరాలు..
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇండోర్ కు చెందిన 19 ఏళ్ల గౌరవ్.. ఇంగ్లీష్ టీచర్ దగ్గరకు కోచింగ్ కోసం వెళ్లేవారు. ఆమె ఇతగాడిని తన వల్లలో వసుకుంది. అంతేకాకుండా.. అతడితో సీక్రెట్ గా రొమాన్స్ చేసేది. గౌరవ్..ఇతర విద్యార్థినులతో మాట్లాడితే.. అతడిని కోప్పడేది. దీంతో అతను పూర్తిగా టీచర్ మాయలో పడిపోయాడు. తరచుగా ఆమెకు గిఫ్ట్ లు, డబ్బులు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా, చోరీలు చేసి మరీ తీసుకొని వెళ్లి ఇచ్చేవాడు. ఈ క్రమంలో ఏమైందో కానీ.. సదరు కిలేడీ.. అతగాడిని బెదిరింపులకు గురిచేసింది.
అతనిపై ఏకంగా పోలీస్ స్టేషన్ కేసు నమోదు ఫైల్ చేసింది. దీంతో పోలీసులు గౌరవ్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు సదరు కిలేడీ..తనకురూ.3 లక్షలు ఇస్తే కేసు వాపస్ తీసుకుంటానంటూ బెదిరించింది. దీంతో.. విధిలేక.. గౌరవ్ తండ్రి.. మొదట 45 వేలు చెల్లించి తన కొడుకును బెయిల్ మీద బయటకు తెప్పించుకున్నాడు. దీంతో అతను ఒత్తిడికి లోనయ్యాడు. తన ఇంట్లో బెడ్ రూమ్ లో వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో వెళ్లి చూసే సరికి అతగాడు విగత జీవిగా మారాడు. ఈ నేపథ్యంలో పోలీసులు డెడ్ బాడీనీ స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు తరలించారు.
Read more: Suriya: సినిమా షూటింగ్ లో ఊహించని ఘటన.. హీరో సూర్య తలకు గాయం.. అసలేం జరిగిందంటే..
ఈ ఘటన మంగళవారం జరిగినట్లు తెలుస్తోంది. తమ కొడుకును 11 నెలలుగా టీచర్ వేదింపులకు గురిచేస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాజాగా, ఇన్ స్టాలో యువకుడు.. టీచర్ కు మధ్య జరిగిన చాట్స్ బైటపడ్డాయి. ఆమె టీచర్ కాదని, కామ పిశాచి అని ఆ చాట్ లలో బైటపడింది. తనతో రొమాన్స్ చేయాలని ఆమె బెదిరించి. దీనికి ఒప్పుకొక పోవడంతోనే కేసు పెడతానంటూ బెదిరించినట్లు తెలుస్తోంది. చివరకు ఫెక్ కేసు పెట్టినట్లు సమాచారం. ఈ చాటింగ్స్ పై విచారణ జరిపి, పోలీసులు ఆమెపై చర్యలుతీసుకొవాలని కూడా గౌరవ్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై పోలీసుల సత్వరం చర్యలు తీసుకుని, యువకుడి ప్రాణాలు పోయేలా చేసిన టీచర్ పై కఠిన చర్యలు తీసుకొవాలంటూ కూడా ఇండోర్ లో పలువురు స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter