Suriya: సినిమా షూటింగ్ లో ఊహించని ఘటన.. హీరో సూర్య తలకు గాయం.. అసలేం జరిగిందంటే..

Hero suriya injured: హీరో సూర్య తలకు బలమైన  గాయమైంది. దీంతో షూటింగ్ సిబ్బంది హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు. దీంతో ప్రస్తుతం ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

1 /6

తమిళ సూపర్ స్టార్ హీరో సూర్యకు షూటింగ్ లో ఉండగా అనుకోని ఘటన ఎదురైంది. కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న మూవీ సూర్య 44 మూవీ ఊటిలో షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో అనుకోని ఘటన ఎదురైంది.

2 /6

సినిమాకు సంబంధించి షూటింగ్ చేస్తుండగా.. ఆయన తలకు బలమైన గాయమైంది. వెంటనే అక్కడున్న మూవీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.  ఊటీలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. 

3 /6

సూర్యకు టెస్టులు చేసిన డాక్టర్ లు ఆయనకు కొంత విశ్రాంతి అవసరమని చెప్పారంట. తలకు గాయంకావడంతో స్కానింగ్ లకు రిఫర్ చేశారంట. దీంతో ఆయన కుటుంబంతో పాటు, అభిమానులు టెన్షన్ పడుతున్నారు. 

4 /6

దీనిపై నిర్మాత రాజశేఖరన్ పాండియన్ స్పందించారు. సూర్యకు గాయమైన మాట వాస్తవమేనని అన్నారు. అంతేకాకుండా.. ఆయన కోలుకోవడానికి కొంత సమయంపడుతుందన్నారు. అప్పటి దాక సినిమా షూటింగ్ లు చేయరని కూడా క్లారిటీ ఇచ్చారు.

5 /6

ఇదిలా ఉండగా... ప్రేమ, నవ్వు, యుద్ధం నేపథ్యంలో.. రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఊటిలో ప్రారంభమైంది. అక్కడ ప్రమాదం జరగ్గానే వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

6 /6

ఇదిలా ఉండగా ఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్ , పూజా హెగ్డే, జయరామ్, జోజు జార్జ్, కరుణాకరన్, నాసర్, సుజిత్ శంకర్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం సూర్య..  మూవీ కంగువ సినిమా రిలీజ్ కు సిద్దమౌతుంది. దీన్ని శివ తెరకెక్కించారు. ఈ మూవీ అక్టోబర్ 10 న విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది.