Man Kills His Wife In Jharkhand: ఆమెను అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ మహిళకు మొదటి భర్త సోదరుడితో అక్రమ సంబంధం ఉంది. రెండో పెళ్లి చేసుకున్న తరువాత కూడా అతడితో ఫోన్‌లో మాట్లాడేది. ఈ విషయం తెలుసుకున్న రెండో భర్త.. ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేశాడు. అనంతరం అతనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరచుగా భార్య గురించి అడుగుతుండడంతో అనుమానం వచ్చి పోలీసులు అతడిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్యను దాచి పెట్టిన స్థలం తెలుసుకుని అవాక్కయ్యారు. జార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఝార్ఖండ్‌లోని గిరిడీకి చెందిన మనీశ్‌ అనే వ్యక్తి అర్జుమన్‌ బానో అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లి జరిగ్గా.. మొదటి భర్తకు దూరంగా ఉంది. అయితే       రెండో పెళ్లి తరువాత మొదటి భర్త సోదరుడితో నిత్యం ఫోన్‌లో మాట్లాడేది. ఈ విషయం తెలుసుకున్న మనీశ్.. అర్జుమన్‌పై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేశాడు.   


ఓ రోజు సొంతూరికి వెళ్దామని ఆమెను కారులో తీసుకువెళ్లాడు. దారి మధ్యలో అర్జుమన్‌ బానో మెడకు దుపట్టాను బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తన ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడే ఫ్రెండ్‌తో కలిసి అతని ఇంట్లోనే పాతిపెట్టి.. పైన సిమెంట్‌తో పూడ్చిపెట్టారు. అనంతరం ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత మూడు నెలలకు తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. ఫిర్యాదు చేసిన అనంతరం తన భార్య ఆచూకీ తెలిసిందా..? అంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అడిగేవాడు.


మనీశ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ అర్జుమన్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారణ చేపట్టగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని తన స్నేహితుడు ఇంట్లో పూడ్చి.. సిమెంట్ కప్పినట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మనీశ్‌ స్నేహితుడు ఇంట్లో తవ్వగా.. అంజుమన్ అస్థిపంజరం బయటపడింది. కేసు నమోదు చేసుకుని.. నిందితుడి నుంచి మరిన్ని వివరలు రాబడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 


Also Read: Etela Rajender: నేను బీఆర్ఎస్‌ను వీడలేదు.. వాళ్లే నన్ను బయటకు పంపారు.. పార్టీ మార్పుపై ఈటల హాట్ కామెంట్స్  


Also Read: KL Rahul: రెండో టెస్ట్‌కు కేఎల్ రాహుల్ దూరం.. బీసీసీఐ అధికారి క్లారిటీ..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook