KL Rahul: రెండో టెస్ట్‌కు కేఎల్ రాహుల్ దూరం.. బీసీసీఐ అధికారి క్లారిటీ..!

IND Vs Aus 2nd Test Updates: టీమిండియా వైఎస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. వరుసగా విఫలమవుతున్నా తుది జట్టులో అవకాశాలు దక్కుతున్నాయి. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులోనూ 71 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టుకు ఈ ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌ను పక్కనపెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారి క్లారిటీ ఇచ్చారు.     

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2023, 11:26 PM IST
KL Rahul: రెండో టెస్ట్‌కు కేఎల్ రాహుల్ దూరం.. బీసీసీఐ అధికారి క్లారిటీ..!

IND Vs Aus 2nd Test Updates: ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించి టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఘనంగా ప్రారంభించింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత స్పిన్నర్ల ధాటికి కంగారూ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో నాగపూర్ టెస్ట్ మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. రెండో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. 

టెస్టుల్లో వరుసగా విఫలం అవుతున్నా రాహుల్‌కు తుది జట్టులో చోటు కల్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తరువాతి మ్యాచ్‌కు రాహుల్‌కు చోటు కల్పించడం కష్టమేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ అధికారి పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. ఢిల్లీలో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ జట్టులో ఉంటాడని చెప్పారు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ వేచి చూడాల్సిందేనని అన్నారు. కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ రాహుల్‌పై నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు.

బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. 'రాహుల్‌పై కెప్టెన్, కోచ్‌కు నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ కెరీర్‌లో బ్యాడ్ టైమ్ ఫేస్ చేస్తారు. విరాట్ బ్యాడ్ ఫామ్ చాలా కాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. మళ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. రాహుల్ విషయంలో కూడా ఓపిక పట్టాలి. అతను గొప్ప ఆటగాడు. కచ్చితంగా మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు..' అని ధీమాతో చెప్పారు.

కాగా.. కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి తొలగించాలని మాజీలు, క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్‌ను ఎంపికపై ప్రశ్నిస్తూ భారత మేనేజ్‌మెంట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్‌ ప్రసాద్ సంచలన ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. జట్టులోకి పర్ఫామెన్స్‌ ఆధారంగా కాకుండా.. ఫేవరిటిజంతోనే ఎంపిక చేస్తున్నారంటూ బాంబ్ పేల్చారు. రాహుల్ ప్రతిభను, సామర్థ్యాన్ని చాలా గౌరవిస్తానని.. కానీ దురదృష్టవశాత్తూ అతని ప్రదర్శన చాలా దారుణంగా ఉందన్నారు.

రాహుల్‌కు ఇచ్చిన అవకాశాలు చాలా మందికి ఇవ్వలేదని.. ప్రస్తుతం చాలామంది క్రికెట్ యంగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. శుభ్‌‌మన్ గిల్, సర్ఫరాజ్ సెంచరీలు బాదుతున్నాడని.. రాహుల్ కంటే ఇలాంటి ప్లేయర్లు జట్టులో ఉండేందుకు అర్హులని వరుసగా పోస్టులు పెట్టారు. ఆయన చేసిన ట్వీట్లు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

Also Read: CM KCR: ఒక్క మాట నిరూపించండి.. రాజీనామా చేస్తా: సీఎం కేసీఆర్ సవాల్

Also Read: Maha Shivratri 2023: మహా శివరాత్రి స్పెషల్.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News