Loan App: రూ.10 వేలకు రూ.లక్ష చెల్లించాలని వేధింపులు.. కట్టలేక కృష్ణా నదిలో దూకిన విద్యార్థి
Student Commits Suicide In Krishna River At Tadepalli: తీసుకున్నది రూ.10 వేలు కానీ రూ.లక్ష చెల్లించాలని చెప్పడంతో ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. ఇంట్లో వారికి చెప్పే ధైర్యం లేక ఆ విద్యార్థి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Loan App Harassment: సులువుగా రుణాలు వస్తున్నాయని గుర్తింపు లేని యాప్‌ల నుంచి తీసుకుంటే అనంతరం వాటికి తిరిగి చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్‌ల నుంచి రుణాలు పొందిన వారి వేధింపులు తాళలేక పదుల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పాతికేళ్లు కూడా నిండని విద్యార్థి రుణ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీసుకున్న రూ.10 వేలకు రూ.లక్ష చెల్లించాలని వేధించడంతో ఆ విద్యార్థి ఏం చేయాలో తెలియక కృష్ణా నదిలో దూకి చనిపోయాడు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Tragedy Incident: తెలంగాణలో ఘోరం.. గోడ కూలి నలుగురు, బైక్‌పై చెట్టి పడి ఇద్దరు దుర్మరణం
విజయవాడకు చెందిన మురికింట వంశీ (22) ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆఖరి సంవత్సరం చదువుతున్న వంశీ కొన్ని నెలల కిందట ఇంట్లో వారికి తెలియకుండా ఓ రుణ యాప్‌లో రూ.10 వేలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని రుణ యాప్ నిర్వాహకులు వేధించడం ప్రారంభించారు. ఈ వేధింపులు తాళలేకపోయాడు. వారి వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. తీసుకున్న రూ.పది వేలకు రూ.లక్ష చెల్లించాలని కోరడంతో వంశీ దిక్కుతోచలేదు. ఏం చేయలో తెలియదు. ఇంట్లో వారికి చెబితే మందలిస్తారనే భయంతో వంశీ తనలో తనే బాధపడుతున్నాడు.
Also Read: Oyo Room Death: ఓయో రూమ్‌లో ఏపీ ఉపాధ్యాయుడు మృతి.. పెళ్లి కాకపోవడమే కారణమా?
రుణ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్రమవడంతో వాటిని తట్టుకోలేక వంశీ ఈనెల 25వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తాను చనిపోతున్నానని కుటుంబసభ్యులకు సందేశం పంపాడు. ఇది చూసిన కుటుంబీకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఫోన్ చేయడానికి ప్రయత్నించగా స్విచ్ఛాప్ అని వచ్చింది. ఆందోళనకు గురయిన కుటుంబసభ్యులు తెలిసిన వారి వద్దు, వంశీ స్నేహితుల వద్ద ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది. గాలిస్తున్న సమయంలో గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద ఉన్న కృష్ణా నది ఒడ్డు వద్ద వంశీకి చెందిన సెల్‌ఫోన్, చెప్పులు, బైక్ కనిపించింది.
ఆందోళనకు గురయిన కుటుంబీకులు వెంటనే గజ ఈతగాళ్లను పిలిపించారు. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసుల సహాయంతో గత ఈతగాళ్లు కృష్ణా నదిలో గాలించగా వంశీ మృతదేహం లభించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వంశీ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు రుణ యాప్ నిర్వాహకుల వివరాలు ఆరా తీస్తున్నారు.lo
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook