Madhya Pradesh Firing: రెండు వర్గాల మధ్య కాల్పులు.. ఆరుగురు మృతి.. వీడియోలు వైరల్
MP Firing News Latest Update: రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఆరుగురు ప్రాణాలను బలిగొంది. మధ్యప్రదేశ్‌లో భూవివాదం కారణంగా ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నారు. ఆరుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
MP Firing News Latest Update: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూవివాదం కారణంగా రెండు వర్గాల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మొరెనా జిల్లాలో ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. శుక్రవారం శుక్రవారం ఉదయం మోరెనాలోని లేపా గ్రామంలో ఈ కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లేప గ్రామాన్ని పోలీసు కంటోన్మెంట్‌గా మార్చారు. ఇక్కడ భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు గుర్తించారు. పలువురికి గాయాలు అవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.
మొరెనా జిల్లాలోని పోర్సా ప్రాంతంలోని లేపా గ్రామంలో రెండు వర్గాల మధ్య పాత కక్షల కారణంగా గొడవలు జరిగాయి. భూ వివాదంలో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు తీయగా.. అందులో కాల్పులు జరుపుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. పాత కక్షల కారణంగానే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. కేసు దర్యాప్తు ఉందని.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు.
కాల్పులకు కారణం ఏంటి..?
సోహానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని లేపా గ్రామంలో రంజిత్ తోమర్, రాధే తోమర్ కుటుంబాల మధ్య చాలా కాలంగా భూ వివాదం నడుస్తోంది. వీరిద్దరి మధ్య గతంలోనూ భారీగా ఘర్షణలు జరిగాయి. ఈ గొడవల్లో ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. శుక్రవారం మరోసారి రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కర్రలు, రాడ్‌లతో దాడి చేసుకుంటుండగా.. కొంతమంది యువకులు తుపాకీలతో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
Also Read: IND vs PAK Match: భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ అంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook