India vs Pakistan ODI World Cup 2023: భారత్-పాకిస్థాన్ జట్ల మ్యాచ్ అంటే ఎంతో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తారు. కాలేజీలకు డుమ్మా కొట్టి స్టూడెంట్స్.. ఆఫీసులకు సెలవులు పెట్టి ఉద్యోగులు మ్యాచ్ చూసేందుకు రెడీ అవుతారు. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో నిలిచిపోగా.. ఐసీసీ టోర్నమెంట్లలోనే ముఖాముఖి తలపడుతున్నాయి. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్‌ను రికార్డుస్థాయిలో వీక్షించారు. త్వరలో జరిగే ఆసియా కప్‌లోనూ రెండు జట్ల మధ్య పోరును చూడొచ్చు. అయితే ఈలోపు మరో ఆసక్తికరమై వార్త తెరపైకి వచ్చింది.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 భారత్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వరల్డ్ కప్ జరిగే అవకాశం ఉంది. విశ్వకప్ కోసం పాక్ జట్టు భారత్‌కు రానుంది. ఈ నేసథ్యంలోనే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరగే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. క్రికెట్ సర్కిల్‌లో ఈ వార్త వైరల్ అవుతోంది. ప్రపంచకప్ 2019లో భారత్-పాకిస్థాన్ మధ్య చివరి వన్డే మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి వన్డే ఫార్మాట్‌లో ఇరు జట్లు తలపడలేదు.
ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఎక్కువ మంది అభిమానులు స్టేడియానికి వచ్చే వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు. టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తే.. ఎక్కువ మందికి లైవ్‌లో చూసే అవకాశం దక్కుతుంది. ఈ స్టేడియంలో దాదాపు లక్ష మంది ప్రేక్షకులు కూర్చోవచ్చు. దీనిపై భారత జట్టు మేనేజ్‌మెంట్‌తో బీసీసీఐ చర్చించనుంది. త్వరలోనే ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ రానుంది.
వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా చెన్నై, బెంగళూరులో తమ మ్యాచ్‌లు ఆడాలని పాక్ జట్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కూడా తమకు ఒకే అని చెబుతున్నారు. నాగ్‌పూర్, బెంగళూరు, త్రివేండ్రం, ముంబై, ఢిల్లీ, లక్నో, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, రాజ్‌కోట్, ఇండోర్, బెంగళూరు, ధర్మశాల వరల్డ్ కప్ వేదికల కోసం షార్ట్‌లిస్ట్ చేశారు. వీటిలో ఏడు స్టేడియాలను ఎంపిక చేయనున్నారు. పాక్ మ్యాచ్‌లు చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో ఆడే అవకాశం ఉంది.
ఇక చివరగా ప్రపంచకప్ 2019లో భారత్, పాక్ జట్ల మధ్య చివరి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 336 పరుగులు చేయగా.. పాక్ జట్టు 40 ఓవర్లలో 212 రన్స్ మాత్రమే చేసింది. వర్షం కారణంగా 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. టీమిండియా తరుఫున రోహిత్ శర్మ 140 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే భారత జట్టు ఆ వరల్డ్ కప్‌లో సెమీస్‌లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే.
వరల్డ్ కప్ కోసం స్పిన్ పిచ్‌లను తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. స్వదేశంలో గత కొన్నేళ్లుగా స్లో ట్రాక్‌లలో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. వరల్డ కప్‌లో హోమ్ అడ్వంటేజ్ పొందాలని భారత్ చూస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లతో ప్రపంచకప్‌లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లను తయారు చేయాలని భారత మేనేజ్‌మెంట్ బీసీసీఐకి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Delhi BRS Party Office: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook