RR Vs GT Dream 11 Prediction: టాప్ ప్లేస్‌కు టఫ్‌ వార్.. రాజస్థాన్ రాయల్స్‌తో గుజరాత్ అమీతుమీ.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!

Rajasthan Royals Vs Gujarat Titans Preview and Head to Head Records: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు టఫ్ ఫైట్ జరుగుతంది. నేడు గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి మొదటిస్థానంలోకి రావాలని రాజస్థాన్ భావిస్తోంది. డ్రీమ్ 11 టీమ్‌ టిప్స్ మీ కోసం..  

Written by - Ashok Krindinti | Last Updated : May 5, 2023, 12:09 PM IST
RR Vs GT Dream 11 Prediction: టాప్ ప్లేస్‌కు టఫ్‌ వార్.. రాజస్థాన్ రాయల్స్‌తో గుజరాత్ అమీతుమీ.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!

Rajasthan Royals Vs Gujarat Titans Preview and Head to Head Records: ఐపీఎల్‌లో నేడు బిగ్‌ఫైట్ జరగనుంది. పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో గుజరాత్ ఉండగా.. రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో గుజరాత్‌  6 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, రాజస్థాన్‌ రాయల్స్‌ 5 మ్యాచుల్లో విజయం సాధించింది. రెండు జట్లు బలంగా ఉండడంతో పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. రెండు జట్లూ కూడా తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవడంతో తుది జట్లలో మార్పులు చేసే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ప్రారంభంకానుంది. పిచ్ రిపోర్ట్, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి..? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి..? డ్రీమ్ 11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..?

పిచ్ రిపోర్ట్ ఇలా..

సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఎక్కువగా బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పేసర్లు, స్పిన్నర్లు ఇద్దరికీ సమానంగా సహకరిస్తుంది. ఈ మైదానంలో రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. ఆట సాగుతున్న కొద్దీ పిచ్‌ బ్యాటింగ్‌కు మెరుగ్గా మారుతుంది. ఈ మ్యాచ్‌కు కూడా టాస్ కీ రోల్ ప్లే చేయనుంది.

హెడ్ టు హెడ్ రికార్డులు..

ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 4 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో గుజరాత్ 3 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. రాజస్థాన్ ఒక మ్యాచ్‌లో గెలుపొందింది. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ రాజస్థాన్, గుజరాత్ జట్ల మధ్య జరగ్గా.. హార్ధిక్ సేన గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఇక తుది జట్ల విషయానికి వస్తే.. వరుసగా విఫలమవుతున్న గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో కేఎస్ భరత్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. అదేవిధంగా రాజస్థాన్ జట్టులో బౌలింగ్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. 

తుది జట్లు ఇలా.. (అంచనా)

గుజరాత్ టైటాన్స్: కేఎస్ భరత్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ, జోష్ లిటిల్.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మెయర్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ.

డ్రీమ్ 11 టీమ్ టిప్స్:

కీపర్లు - జోస్ బట్లర్ (కెప్టెన్), సంజు శాంసన్

బ్యాట్స్‌మెన్ - శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, డేవిడ్ మిల్లర్

ఆల్ రౌండర్లు - రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్)

బౌలర్లు - ట్రెంట్ బౌల్ట్, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, యుజువేంద్ర చాహల్

Also Read: Delhi BRS Party Office: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..!  

Also Read: IND vs PAK Match: భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ అంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News