Mother Kills Three Daughters: మనసెలా వచ్చిందమ్మా.. ముగ్గురు కూతుళ్లను బావిలోకి తోసి హత్య చేసిన తల్లి
Woman Threw 3 Daughters Into Well in MP: కన్నతల్లి దారుణానికి పాల్పడింది. తన ముగ్గురు కూతుళ్లను బావిలోకి తోసి ప్రాణాలు తీసింది. మధ్యప్రదేశ్‌లో ధార్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Woman Threw 3 Daughters Into Well in MP: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు కూతళ్లను బావిలోకి తోసి హత్య చేసింది ఓ కిరాతక తల్లి. కూతుళ్లను హత్య చేసిన మహిళ అనంతరం పారిపోగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త, పిల్లలతో వివాహ వేడుకకు హాజరై.. అనంతరం ఆమె ఘాతుకానికి పాల్పడింది. మహిళ మానసిక పరిస్థితి బాగోలేదని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇలా..
ధార్ జిల్లా ఖిలాడి గ్రామానికి చెందిన రంజన తన భర్త, ముగ్గురు కుమార్తెలతో వివాహ వేడుకకు శ్యాంపుర గ్రామానికి వచ్చారు. పిల్లలకు మామిడి కాయలు కొనిచ్చిన రంజన భర్త.. వాటిని కోసి ఇవ్వాలని చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రం వచ్చి చూడగా.. పిల్లలు, భార్య కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు అంతా కలిసి వెతకడం ప్రారంభించారు. గ్రామానికి సమీపంలోని ఓ బావి వద్ద వెళ్లి చూడగా.. పక్కనే ఓ అమ్మాయి మృతదేహం కనిపించింది. బావిలో దూకి నీళ్లలో వెతకగా.. మిగిలిన ఇద్దరు అమ్మాయిల మృతదేహాలు లభ్యమైయ్యాయి. మహిళ కూడా బావిలోకి దూకి ఉంటుందనే అనుమానంతో బావిలోని నీటిని మొత్తం తోడేశారు.
మహిళ కనిపించడకపోవడంతో హత్య చేసి పరార్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అమృత (6), జ్యోతి (4), ప్రీతి (2)గా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సమీపంలో అటవీ ప్రాంతంలో మహిళ ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అక్కడివెళ్లి మహిళను అదుపులోకి తీసుకున్నారు. చేతబడి ముసుగులో నిందితురాలు కుతళ్లను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏవో దుష్టశక్తులు తనను వేటాడుతున్నాయనే భయం ఆమెలో ఉందన్నారు. మహిళ మానసిక పరిస్థితి కూడా బాగోలేదని తెలుస్తోందని.. మూఢనమ్మకాలతోనే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె మానసికంగా కుంగిపోయేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో ఓ తాంత్రికుడు వద్ద చికిత్స అందించినట్లు తెలిపారు. మూఢనమ్మకాలతో కూతుళ్లను హత్య చేసిందంటున్నారు. ప్రస్తుతం ఆమె మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Also Read: IPL 2023 Points Table: తలైవా మ్యాజిక్.. టాప్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. ఎస్ఆర్‌హెచ్ పరిస్థితి ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook