Phirangipuram Attack: ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ అంటూ అతను వెంటపడ్డాడు. తనకు ఇష్టం లేదని ఆమె చెబుతున్నా పట్టించుకోలేదు. పెద్దలు మందలించినా మరలేదు. ఆ యువతికి మరో యువకుడితో నిశ్చాతార్థం జరిగింది. అయినా అతను మాత్రం అలానే వెంటపడుతుండడంతో పెద్దలు పంచాయితీ పెట్టారు. మాట్లాడుదామని పిలిచిన పెద్ద మనుషులపై రాడ్ తీసుకుని దాడికి పాల్పడ్డాడు ఆ కాసాయి. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిరంగిపురానికి చెందిన అంజలి అనే అదేప్రాంతానికి చెందిన ఏడుకొండలు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఏడాది నుంచి తనను ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు. తనకు ఇష్టం లేదని అంజలి చెప్పినా.. ఏడుకొండలు మాత్రం అలానే వెంటనే వెంటపడ్డాడు. దీంతో ఏడుకొండల వేధింపులపై కుటుంబ సభ్యులకు చెప్పింది అంజలి.  


దీంతో ఏడాది క్రితమే అంజలి కుటుంబ సభ్యులు ఏడుకొండలను మందలించారు. దీంతో కొద్ది రోజులు అతను సైలెంట్ అయ్యాడు. మళ్లీ ఇటీవల ప్రేమించాలంటూ వెంటపడుతుండగా.. అంజలికి మరో యువకుడితో పెళ్లి నిశ్చితార్థం చేశారు. అయినా ఏడుకొండలు మాత్రం తననే ప్రేమించాలంటూ వేధించాడు.


ఈ నేపథ్యంలోనే ఏడు కొండలు కుటుంబ సభ్యులతో అంజలి కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం పంచాయితీ పెట్టారు. అందరి ముందు ఏడు కొండలు అంటే తనకు ఇష్టం లేదని అంజలి తేల్చిచెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన ఏడుకొండలు, అతని కుటుంబ సభ్యులు.. అంజలి కుటుంబ సభ్యులపై కత్తులు, కర్రలతో దాడులకు దిగారు.


ఈ ఘటనలో అంజలితో పాటు 12 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో జీజీహెచ్‌కు తరలించారు. మరో 9 మందిని నరసరావుపేటలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: India Pakistan Match: ఇండియా విక్టరీని సెలబ్రేట్ చేసుకున్న సుందర్ పిచాయ్.. పాక్‌ ట్రోలర్‌కు స్ట్రాంగ్  కౌంటర్


Also Read: Munugode Elections: రాజగోపాల్ రెడ్డికి షాక్.. చెప్పుతో దాడికి యత్నం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook