Munugode Elections: రాజగోపాల్ రెడ్డికి షాక్.. చెప్పుతో దాడికి యత్నం

Komatireddy Rajagopal Reddy: ఉప ఎన్నికల ప్రచారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర భౌతిక దాడులకు దిగుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2022, 01:55 PM IST
  • బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం
  • మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తం
  • చెప్పుతో దాడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్త
Munugode Elections: రాజగోపాల్ రెడ్డికి షాక్.. చెప్పుతో దాడికి యత్నం

Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, విపక్ష నేతల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ తమనే గెలిపించాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ టీఆర్ఎస్ నాయకులు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఇతర పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. పోలింగ్‌ సమయం పడుతున్న దగ్గర కొద్ది మునుగోడులో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది.

మరోవైపు మాటల యుద్దం కాస్త.. దాడులు చేసుకునే స్థాయికి వెళ్లిపోయింది. ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. నాంపల్లి మండలంలో స్రవంతి ప్రచారానికి వెళుతుండగా కొందరు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓ వాహనాన్ని ధ్వంసం చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. నాంపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద స్రవంతి, ఎమ్మెల్యే సీతక్క, పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై కూడా దాడి యత్నించాడు ఓ కాంగ్రెస్ కార్యకర్త. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ కార్యకర్త చెప్పు తీసుకుని ప్రచార వాహనంపైకి ఎక్కాడు. చెప్పుతో కొట్టేందుకు యత్నించగా.. రాజగోపాల్ రెడ్డి గమనించి వెంటనే వెంటనే జరిగారు. బీజేపీ కార్యకర్తలు అతడిని పక్కకు లాగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దీంతో మునుగోడు నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఆదివారం రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలం జైకేసారంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనూ.. క్వాన్వాయ్‌పైకి ఓ వ్యక్తి మైక్ లాగేసుకున్నాడు. బీజేపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మునుగోడులో నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుgడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

Also Read: Munugode Bypoll: రాజగోపాల్ రెడ్డిపై దాడుల వెనుక ఎవరున్నారు? మునుగోడులో ఏం జరుగుతోంది?

Also Read: Bandala Ganesh - Diwali 2022 : దీపావళి బాంబులకు పెట్టిన ఖర్చు ఎంతంటే?.. బండ్లన్నతో అట్లుంటది  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News