Egg Issue Turns Quarrel: రంగుల పండుగలో కోడిగుడ్డుతో పరస్పరం దాడులు చేసుకోవడం సాధారణం. హోలీ పండుగలో ఒకరిపై కోడిగుడ్డు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. ఆ గుడ్డు పక్కకు జారి ఒకరి ఇంట్లోకి వెళ్లింది. కోడిగుడ్డు ఇంట్లో పడడంతో ఆ ఇంటి మహిళ గొడవపడింది. కోడిగుడ్డు విషయమై ఆమెతోపాటు కుమారుడు గొడవకు దిగారు. ఆ గొడవ కాస్త పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. దాడిలో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: MP Suicide Attempt: టికెట్‌ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపీ.. కొనఊపిరితో గిలగిల


జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో సోమవారం హోలీ పండుగను గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా చేసుకున్నారు. హోలీ ఆడుతున్న సమయంలో ప్రకాశ్‌ అనే వ్యక్తి కోడిగుడ్డును పొరపాటున రమా అనే గృహిణి ఇంట్లో పడింది. అనూహ్య సంఘటనతో ఆ మహిళ అవాక్కైంది. ఇంట్లో కోడిగుడ్డు పగలడంతో తీవ్ర వాసన వచ్చింది. ఈ విషయమై రమా కుమారుడు రిషీ బయటకు వచ్చి ప్రశ్నించాడు. గుడ్డు ఎవరు వేశారని నిలదీయడంతో రిషీపై ప్రకాశ్‌తోపాటు అతడి స్నేహితులు దాడికి పాల్పడ్డారు. క్షణికావేశంలో ప్రకాశ్‌ కొడవలి తీసుకుని రమాపై దాడి చేశాడు. 

Also Rea: Lawyer Suicide: విడాకులు ఇచ్చే లాయర్‌కే తప్పలేదు భార్యతో వేధింపులు.. ఏం చేశాడంటే?


 


కొడవలితో దాడికి పాల్పడడంతో రమ తీవ్రంగా గాయపడింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గాయపడిన మహిళను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దాడికి పాల్పడిన ప్రకాశ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పండుగ రోజు కోడిగుడ్డు విషయం ఇంతటి దారుణానికి దారితీయడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ సంఘటన పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందా? అనే అనుమానాలకు దారి తీస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యక్తి మహిళపై దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. కోడిగుడ్డును ఉద్దేశపూర్వకంగా ఇంట్లోకి విసిరి అనంతరం గొడవకు దిగడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి