MP Suicide Attempt: టికెట్‌ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపీ.. కొనఊపిరితో గిలగిల

MP Ganesamoorthy Drunk Pesticide: ఎన్నికల నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ల పంచాయితీ ప్రాణం మీదకు వచ్చింది. టికెట్‌ రాకపోవడంతో ఓ ఎంపీ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 25, 2024, 05:32 PM IST
MP Suicide Attempt: టికెట్‌ రాలేదని పురుగుల మందు తాగిన ఎంపీ.. కొనఊపిరితో గిలగిల

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ నిరాకరించడంతో ఓ సిట్టింగ్‌ ఎంపీ మనస్తాపానికి లోనయ్యాడు. పార్టీ గుర్తించకపోవడంతో ఆయన ఆవేదనకు గురై పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిణామంతో కుటుంబసభ్యులు, అతడి అనుచరులు ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.

Also Read: Doctor Kicked: డాక్టరా వీధిరౌడీనా.. ఆస్పత్రిలో పేషెంట్‌ను తన్నితరిమిన వైద్యుడు

 

ఎండీఎంకే పార్టీకి పార్టీకి చెందిన ఈరోడ్‌ ఎంపీ గణేశమూర్తికి తాజా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మరోసారి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన ఆదివారం (మార్చి 25న) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే కుటుంబసభ్యులు కోవైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు వెంటిలెటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికీ అతడి ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు.

Also Read: Wine Shops: మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌

డీఎంకే కూటమిలో ఉన్న ఎండీఎంకేకు చెందిన గణేశమూర్తి 2019లో ఈరోడ్‌ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ రోడ్‌ స్థానం ఇతర పార్టీకి దక్కింది. పొత్తులో భాగంగా ఎండీఎంకే పార్టీకి తిరుచ్చి స్థానం లభించగా అక్కడ దురై వైగోను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అవకాశం దక్కకపోవడంతో వారం రోజులుగా గణేశమూర్తి తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ముభావంగా ఎవరితో అందుబాటులో ఉండడం లేదు. ఇంట్లోనే ఉంటున్న ఆయన ఆదివారం ఈ దారుణానికి ఒడిగట్టారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గణేశమూర్తిని ఎండీఎంకే పార్టీ నాయకులు దురై వైకో పరామర్శించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News