Woman Murder In Hyerabad: భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాదిగా విడిపోయారు. భర్తకు దూరంగా ఆమె బోటిక్ షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తనతో కాపురం చేయకుండా భార్య ఒంటరిగా జీవిస్తుండడంతో భర్తకు అనుమానం పెరిగింది. దీంతో ఆమెపై హత్యకు ప్లాన్ చేశాడు. శుక్రవారం తనతోపాటు కత్తి తీసుకుని వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో పట్టగలే అందరూ చూస్తుండగానే.. వెంటాడి మరీ దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరం శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నల్లగండ్ల ప్రాంతానికి చెందిన నరేందర్‌,  అంబిక (26) భార్యాభర్తలు. భర్తతో విబేధాల కారణంగా ఆమె దూరంగా ఉంటోంది. నరేందర్ తాండూర్‌లో ఉంటున్నాడు. అంబిక ఓ బొటిక్ షాపులో పనిచేస్తోంది. శుక్రవారం నల్లగండ్లకు వచ్చిన నరేందర్.. అంబికతో గొడవకు దిగాడు. మాటమాట పెరగడంతో నరేందర్ కోపోద్రిక్తుడయ్యాడు. మొదట బండ రాయితో ఆమెపై బాదాడు. దీంతో రక్తం కారుతున్నా భర్త నుంచి తప్పించుకున్నా అంబిక అక్కడి పరిగెత్తుకుంటూ వచ్చింది.


రోడ్డుపైకి నన్ను కాపాడండి.. కాపాడండి.. నన్ను చంపేస్తున్నాడు.. అంటూ గట్టిగా అరుస్తూ పరిగెత్తింది. అయినా వదలకుండా నరేందర్ ఆమె వెంట మరీ పట్టుకున్నాడు. కత్తితో దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. రోడ్డుపై అందరూ చూస్తు నిలబడిపోయారే గానీ.. ఎవరు ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. రక్తపు మడగులో అంబిక ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నరేందర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 


Also Read:  వలసదారుల పడవ బోల్తా.. 25 మంది మృత్యువాత, 15 మంది మిస్సింగ్..


మరోవైపు హైదరాబాద్‌లో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. తుక్కుగూడ-శ్రీశైలం హైవేలో ఓ మహిళను దారుణంగా హత్య చేసి.. ప్లాస్టిక్ బ్యాగులో మృతదేహాన్ని చుట్టి పాడేసిన ఘటన సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. కుళ్లినస్థితిలో మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పాడ్డారు పోలీసులు. ఆ ఘటన మరువకముందే మరో మహిళను పట్టపగలే హత్య చేయడం భయాందోళనకు గురిచేస్తోంది. 


Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.