Migrant boat capsize: వలసదారుల పడవ బోల్తా.. 25 మంది మృత్యువాత, 15 మంది మిస్సింగ్..

Tunisia: వలసదారుల పడవ బోల్తా పడటంతో 25 మంది మృతి చెందిన ఘటన ట్యునీషియా తీరంలో జరిగింది. ఈ ఘటనలో మరో 15 మంది గల్లంతయ్యారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 10:58 AM IST
Migrant boat capsize: వలసదారుల పడవ బోల్తా..  25 మంది మృత్యువాత, 15 మంది మిస్సింగ్..

Boat sinking off Tunisia: ట్యునీషియా దేశంలో పెను విషాదం చోటుచేసుకుంది. మధ్యధరా సముద్రంలో వలసదారులతో ఐరోపా వైపు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడటంతో 25 మంది ఆఫ్రికన్ వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గల్లంతయ్యారు. 72 మందిని ట్యునీషియా అధికారులు రక్షించారు. తూర్పు-మధ్య ట్యునీషియాలోని ఓడరేవు అయిన స్ఫాక్స్ తీరానికి సమీపంలో ఈ పడవ మునిగిపోయింది. 

బోటు కింద చిక్కుకున్న 15 మంది మృతదేహాలను కోస్ట్ గార్డు అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. అంతకముందు రోజు అంటే బుధవారం నాడు పది డెడ్ బాడీస్ ను వెలికి తీశారు. మరణించిన లేదా రక్షించబడిన దాదాపు అందరూ సబ్-సహారా ఆఫ్రికాకు చెందిన వారేనని స్ఫాక్స్ ప్రాసిక్యూటర్ ఫౌజీ మస్మౌడీ చెప్పారు. 

Also Read: H3N8 Bird Flu Virus: చైనాలో H3N8 బర్డ్ ఫ్లూ వైరస్‌తో తొలి మరణం

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలలో మధ్యధరా సముద్ర మార్గం ఒకటి. ఐరోపా దేశాలకు ఈ మార్గం ద్వారానే స్మగ్లర్లు వలసదారులను చిన్న చిన్న పడవల్లో తరలిస్తుంటారు. పరిమితికి మించి జనాలను పడవల్లో ఎక్కించడం వల్ల ఇవి తరుచూ ప్రమాదాలకు గురి అవుతూ ఉంటాయి. దీని కారణంగా ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారు.  మూడు వారాల కిందటే సముద్రంలో పడవ మునిగిపోవడంతో 29 వలసదారులు మృతి చెందగా, మరో 67 మంది గల్లంతయ్యారు. కొంత మందిని అధికారులు రక్షించారు. వీరంతా కూడా ఆఫ్రికా వాసులే. 

Also Read: Texas dairy explosion: డెయిరీ ఫాంలో భారీ పేలుడు.. 18,000 ఆవుల మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News