Hyderabad Eve-teasing case: మహిళను అసభ్యకరంగా తాకిన యువకుడికి జైలు శిక్ష
Hyderabad Eve-teasing case: కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ వెంటపడి బలవంతంగా తాకుతూ ఈవ్ టీజింగ్ కి పాల్పడిన యువకుడికి కోర్టు 16 రోజుల జైలు శిక్ష విధించింది. నాంపల్లి 10వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టులో నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీని హాజరు పరచగా.. కోర్టు నిందితుడికి 16 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Hyderabad Eve-teasing case: కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా వెళ్తున్న మహిళ వెంటపడి బలవంతంగా తాకుతూ ఈవ్ టీజింగ్ కి పాల్పడిన యువకుడికి కోర్టు 16 రోజుల జైలు శిక్ష విధించింది. హాఫిజ్ బాబా నగర్ కు చెందిన ఓ మహిళ ఈ నెల 11వ తేదీన ఉదయం కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు ఒంటరిగా వెళ్తుండగా.. ఆమెను బైక్ పై వెంబడించిన అదే ప్రాంతంలో నివాసం ఉండే మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ( 27 ) అనే యువకుడు సదరు మహిళను వెంబడించాడు. గత కొంతకాలంగా ఆమెను తన వశం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న మహమ్మద్ ఇర్ఫాన్ అలీ.. ఆమె లొంగక పోవడంతో చివరకు బహిరంగంగానే ఆమెపై వేధింపులకు దిగాడు.
కూరగాయలు కొనుగోలు చేయడానికని మార్కెట్ కి వెళ్తున్న సమయంలో ఆమెను బైకుపై ఫాలో అయిన మహమ్మద్ ఇర్ఫాన్ అలీ.. ఆమెను బైకుపై కూర్చోమని చెబుతూ ఆమె వెనుక భాగంలో చేతులతో తాకుతు అసభ్యంగా ప్రవర్తించి ఈవ్ టీజింగ్ కి పాల్పడ్డాడు. ఇర్ఫాన్ అలీ వేధింపులు ఎక్కువ అవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాధితురాలు ఇక చేసేదేం లేక కాంచన్ బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై ఈ కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు.
ఇది కూడా చదవండి : BJP Woman Leader Suicide: బీజేపీ నాయకుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీక్.. మహిళా నేత ఆత్మహత్య
నాంపల్లి 10వ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టులో నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీని హాజరు పరచగా.. కోర్టు నిందితుడికి 16 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. నేరం జరిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరచడమే కాకుండా తగిన సీసీటీవీ ఆధారాలు కోర్టులో సమర్పించి అతడికి శిక్షపడేలా చూడటంలో పోలీసులు తమ వంతు పాత్ర పోషించారు. నేరం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే నిందితుడికి శిక్షపడిన అతి కొద్ది కేసుల్లో ఇదీ ఒకటి అని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : శంషాబాద్ లో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి