Hyderabad: కీచక ఇన్స్పెక్టర్ మెడకు ఉచ్చు..అత్యచార కేసులో మాజీ సీఐ పై చార్జీషీట్‌ దాఖలు..

Hyderabad:  మాజీ ఇన్స్పెక్టర్ కోరట్ల నాగేశ్వర రావుకు సంబంధించిన కేసులో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో 600 పేజీల సమగ్ర ఛార్జిషీటు దాఖలు చేశారు పోలీసులు. ఇందులో భాగంగా అత్యా చారం చేశాడని నిరూపించే బలమైన ఆధారాలు, సాక్ష్యాలను విచారణాధికారి ఛార్జిషీటులో పేర్కొన్నారు.

Written by - Gopi Krishna | Last Updated : Oct 13, 2022, 06:32 PM IST
  • కీచక ఇన్స్పెక్టర్ మెడకు ఉచ్చు..
  • అత్యచార కేసులో మాజీ సీఐ పై చార్జీషీట్‌ దాఖలు.
  • 600 పేజీల సమగ్ర ఛార్జిషీటు దాఖలు
Hyderabad: కీచక ఇన్స్పెక్టర్ మెడకు ఉచ్చు..అత్యచార కేసులో మాజీ సీఐ పై చార్జీషీట్‌ దాఖలు..

Hyderabad: కీచక ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావ్ పై ఆరువందల పేజీల ఛార్జిషీట్ ని బలమైన ఆధారాలు, సాక్ష్యాలతో కోర్టుకి సమర్పించారు వనస్థలిపురం పోలీసులు.  అత్యాచారం, హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ కోరట్ల నాగేశ్వర రావు మెడకు ఉచ్చు బిగుస్తోంది. అతను అత్యా చారం చేశాడని నిరూపించే బలమైన ఆధారాలు, సాక్ష్యాలను విచారణాధికారి సేకరించారు. ఈ మేరకు హయతనగర్ లోని 7వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో 600 పేజీల సమగ్ర ఛార్జిషీటు దాఖలు చేశారు.

వనస్థలిపురంలోని బాధితురాలి ఇంట్లో నాగేశ్వరరావుకు సంబంధించిన ఆనవాళ్లు, నమూనాలు సేకరించిన పోలీసులు, అతడి డీఎన్ఏతో పోల్చారు. ఈ రెండూ మ్యాచ్ అయినట్లు నిపుణులు నివేదిక అందించారు. వైద్య నివేదికతో పాటు పలు సాంకేతిక ఆధారాలను పోలీసులు ఛార్జిషీట్లో పొందుపరిచారు. నేరం జరి గిన సమయంలో నాగేశ్వరరావు ఘటనాస్థలిలోనే ఉన్నాడని రుజువు చేసేందుకు సెల్ఫోన్ టవర్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

తుపాకీతో తురాలి భర్త ఇంటికి అతని తలపై మోది, భార్యభర్తలిద్దరినీ గన్ తో బెది రించి కారులో ఎక్కించుకున్నాడు. బాధితురాలి భర్తతో డ్రైవింగ్ చేయిస్తూ ఇబ్రహీంపట్నం తీసు డ్రైవింగ్ చేయిస్తూ ఇబ్రహీంపట్నం వైపు తీసు కెళుతుండగా.. చెరువు కట్ట వద్ద కారు డివైడర్కు ఢీ కొని ప్రమాదానికి గురైంది. ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయిన బాధితురాలు, ఆమె భర్త వనస్థ లిపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీఐ నాగేశ్వరరావుపై అత్యాచారం, హత్యాయత్నం, అప హరణ, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు అయ్యింది.

సంఘటన రోజు బాధితురాలి ఇంటికి తుపాకీ తీసు కెళ్లలేదని, ఠాణాలో సరెండర్ చేశానని నాగేశ్వరరావు వాదించినా కట్టుకథేనని తేలింది. ఠాణా రికా ర్డులను, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు ఆ రోజు నాగేశ్వరరావు పోలీసుస్టేషన్ కే రాలేదని గుర్తిం చారు. ఘటన జరిగిన మరుసటి రోజు అదే స్టేష న్లోని తన కింది అధికారికి తుపాకీ ఇచ్చి, అప్పటికే సరెండర్ చేసినట్లు రికార్డుల్లో రాయించాడని తేలింది.

నాగేశ్వరరావు సెల్ఫోన్ లొకేషను సేకరించగా తుపాకీని స్టేషన్ లో డిపాజిట్ చేసినట్లు నమోదైన సమయంలో అతడు తన ఇంట్లోనే ఉన్నట్లు స్పష్ట మైంది. కేసు ఉపసంహరించుకోవాలని సాక్ష్యులను బెదిరించాడనీ దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆయా సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ పుటేజీలను న్యాయస్థానంలో సమర్పించారు. ఇప్పుడు ఈకేసులో కీలకంగా కారు సీసీటీవీ ఫుటేజ్ మారింది.

సీసీ ప్రతి ఫుటేజిలో నాగేశ్వర రావు స్పష్టంగా రికార్డయ్యారు. అలాగే బాధితు రాలు, ఆమె భర్త వాంగ్మూలం, ఇతరత్రా సాంకేతిక ఆధారాలను ఐఓ కోర్టుకు సమర్పించారు. బలమైన ఆధారాలు, సాక్ష్యాలతో నిందితుడు నాగేశ్వరరావు కు శిక్ష పడుతుందని పోలీసులు చెప్తున్నారు. కాగా  నాగేశ్వరరావును పోలీసు విభాగం సోమవారమే ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

Also read: Hot Stocks: 15 రోజుల్లో లాభాలు కురిపించనున్న మూడు కంపెనీల షేర్లు

Also read: Hot Stocks: 15 రోజుల్లో లాభాలు కురిపించనున్న మూడు కంపెనీల షేర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News