శంషాబాద్ లో దారుణం.. మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

కఠినంగా శిక్షించే చట్టాలు ఎన్ని ఉన్న మహిళలపై జరిగే అఘాయిత్యాలు తగ్గటం లేదు. శంషాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయింది. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2023, 01:30 PM IST
శంషాబాద్ లో దారుణం.. మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

Murder in Shamshabad: మహిళలపై దాడులు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. దేశంలో మహిళల భద్రతపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించే చట్టాలు మన వద్ద ఉన్నాయి. కానీ కొందరు కామంతో కళ్లు మూసుకు పోయిన వారు ఏమాత్రం భయం లేకుండా.. ఎలాంటి శిక్ష ను అనుభవించాల్సి వస్తుందో అనే బెరుకు కూడా లేకుండా ఆ క్షణంలో అనిపించింది చేస్తున్నారు. ప్రతి రోజు మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, హత్యలు ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఈ తరహా నేరాలు ఆగక పోవడం పట్ల పోలీసు ఉన్నతాధికారులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల శంషాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన సంఘటన ఒక్కసారిగా అందరిని ఉలిక్కి పడేలా చేసింది. పోలీసు వ్యవస్థపై కొందరు విమర్శలు చేస్తున్నారు. 

సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయింది. ఆ మహిళపై దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. గుర్తు తెలియని మృతదేహంకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించి గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టు పక్కల ఏమైనా మహిళ మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయ అనే విషయాన్ని ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఎంక్వౌరీ చేస్తున్నారు. మరో వైపు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

Also Read: Ambati Rambabu: 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు..' మంత్రి అంబటి ఇంట్రెస్టింగ్ ట్వీట్  

మహిళ వయస్స 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ముందు మహిళపై అత్యాచారం జరిగిందా.. పెనుగులాట జరిగి ఉంటుందా అనే విషయమై పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు. మహిళ చనిపోయిన తర్వాత తీసుకు వచ్చి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారా లేదంటే బతికి ఉండగానే తీసుకు వచ్చి కొట్టి లేదా అఘాయిత్యం చేసి చంపేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఒకటి రెండు రోజుల్లోనే మహిళ మృతదేహంను గుర్తించాల్సి ఉంది. వెంటనే మహిళను గుర్తిస్తే ఆ తర్వాత కేసుకు సంబంధించిన ముందడుగు పడినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఆమెను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగినట్లుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మొత్తానికి ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోషులను వెంటనే అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనల కారణంగా చిన్న పిల్లలను అమ్మాయిలను ఒంటరిగా బయటకు పంపించాలి అంటే కుటుంబ సభ్యులు బయపడుతున్నారు. ఒంటరిగా పెద్ద వారు కూడా బయట తిరగలేని పరిస్థితి.

Also Read: RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x