Man in Burqa Enters Ladies Washroom In Lulu Shopping Mall: బురఖాలో షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యువకుడు ఆ షాపింగ్ మాల్‌లో ఉన్న మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి మొబైల్‌ ఫోన్‌తో వీడియోలు రికార్డు చేసిన ఘటన కేరళలో కలకలం సృష్టించింది. కొచ్చిలోని లులు షాపింగ్ మాల్ లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బురఖాలో వచ్చిన యువకుడి కదలికల పట్ల అనుమానం వచ్చిన షాపింగ్ మాల్ సెక్యురిటీ సిబ్బంది అతడిని ఆపి ప్రశ్నించడంతో అసలు బాగోతం వెలుగులోకొచ్చింది. నిందితుడిని 23 ఏళ్ల అభిమన్యు అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా గుర్తించినట్టు కొచ్చిలోని కలమసేరి స్టేషన్ పోలీసులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీటెక్ గ్రాడ్యూయేట్ అయిన అభిమన్యుని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ 354 ( C), 419, ఐటి యాక్టులోని సెక్షన్ 66 E కింద కేసు నమోదు చేశారు. అభిమన్యుని కొచ్చి కోర్టులో హాజరుపరచగా, కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 


కొచ్చిలోని ఇన్ఫోపార్క్‌లో ఉన్న ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నిందితుడు అభిమన్యు.. బురఖాలో ఒక మహిళ తరహాలో నటిస్తూ షాపింగ్ మాల్లోకి ప్రవేశించడమే కాకుండా.. నేరుగా మహిళల వాష్‌రూమ్‌లోకి వెళ్లి తన మొబైల్‌ను అక్కడ హిడెన్ కెమెరా తరహాలో ఏర్పాటు చేశాడని ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న కలమసేరి పోలీసులు తెలిపారు. 


ఇది కూడా చదవండి : Flowers Plants Thief: వీడో వెరైటీ దొంగ.. ఏం చేస్తున్నాడో చూడండి..


అభిమన్యు ముందే తన ఫోన్‌ను ఒక చిన్న కార్డ్‌బోర్డ్ పెట్టెలో పెట్టి షాపింగ్ మాల్ కి తీసుకొచ్చాడు. అందులోంచి బయటి దృశ్యాలు రికార్డు చేసేలా చిన్న రంద్రం చేసి అక్కడ తన మొబైల్ కెమెరాను బిగించాడు. ఆ కార్డ్ బోర్డ్ బాక్సును వాష్‌రూమ్ తలుపుకు లోపలి వైపు నుండి అంటించాడు. ఆ తరువాత ఏమీ ఎరుగనట్టుగా అక్కడి నుంచి బయటకు వచ్చి వాష్‌రూమ్‌ బయట నిలబడ్డాడు. అభిమన్యు ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన షాపింగ్ మాల్ సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బురఖాలో ఉన్నది మహిళ కాదని.. యువకుడు అని తేలింది. దీంతో పోలీసులు నాలుగు తగిలించే సరికి అతడు ఎందుకు అలా చేశాడు, ఏం చేశాడు అని మొత్తం బండారం బయటపడింది. ఇది కూడా చదవండి : Snake In Cauliflower: కాలీఫ్లవర్‌‌లో పాము.. ఒళ్లు జలదరించే షాకింగ్ వీడియో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి