Flowers Plants Thief: ఎక్కడైనా ఇంట్లో దొంగలు పడ్డారంటే ఎవరైనా ఏమనుకుంటారు. ఆ ఇంట్లో బంగారు నగలు, భారీ మొత్తంలో నగదు పోయి ఉంటాయనే కదా.. కానీ ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన మాత్రం అందుకు భిన్నంగా ఉండటమే కాదు.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీలో బాలార్జున్ గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న పెరటి లోకి రాత్రి వేళ ప్రవేశించిన ఓ దొంగ... అక్కడ నాటిన ఓ పూల మొక్కను చోరీ చేశాడు. అరుదుగా పెంచుకునే నూరు వరాల పూల మొక్కను దొంగోడు తీసుకుపోయాడంటూ ఆ కుటుంబం వాపోయింది.
పూల మొక్కను చోరీ చేయడానికి వచ్చిన ఆ దొంగ తీరు చూస్తే.. ఏరికోరి మరీ దాన్నే వెతుక్కుని దొంగిలించుకుపోయిన తీరు చూస్తే... ఆ దొంగ కన్నంతా అరుదైన ఆ పూల మొక్కపైనే ఉంది అని అర్థం అవుతోంది.
ఇలా ఇంటి పెరట్లోంచి పూల మొక్కలు మాయం అవడం ఇదేం మొదటిసారి కాదట ... జనం ఎంతో ఇష్టంగా పెంచుకున్న పూల మొక్కలను, ఈ పూల దొంగ రోజుకు ఒకటి చొప్పున మాయం చేస్తున్నాడు. వరుసగా పూల మొక్కలు చోరీకి గురవుతున్న ఘటనలు చూసి జనం షాకవుతున్నారు. ఎప్పుడూ లేనిది ఇలా పూల మొక్కలు మాయం చేసే దొంగ రావడం ఏంటా అని అందరూ ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ చోరీ చేసిన ఆ పూల మొక్కలను ఆ పూల దొంగ ఏం చేస్తున్నాడు ? మరొకరికి అమ్ముకుంటున్నాడా ? లేక తన ఇంట్లోనే ఇష్టంగా పెంచుకుంటున్నాడా ? అని జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఏదేమైనా వరుసగా పూల మొక్కల చోరీ ఘటనలతో కాలనీలోని ఆడవాళ్లు పూల మొక్కలను పెంచుకోవాలంటేనే భయపడుతున్నారట. పూల మొక్క కోసం వచ్చే ఆ దొంగ కన్ను తమ ఇంటిపై పడితే పరిస్థితి ఏంటనేదే వారి భయానికి కారణం. అందుకే ఈ పూల మొక్కల దొంగను పట్టిస్తే 2000 రూపాయల నజరానా బహుమతిగా ఇస్తామని కాలనీవాసులు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ నెల 14న సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగిన మరో పూల మొక్క చోరీ దృశ్యాలు అక్కడి ఇంటి యజమాని ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితులు, అక్కడి కాలనీ వాసులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : Cats & Hen Viral Video: కోడి పిల్లలను పెంచుకుంటున్న పిల్లి.. ఆ సీన్ చూసి షాకైన తల్లి కోడి
మొత్తానికి చూసేవారిని విస్మయానికి గురిచేస్తోన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ దొంగ ఈ పూల మొక్కలతో ఏం చేస్తున్నాడు ? అర్ధరాత్రి వేళ పూల మొక్కను తీసుకుని వెళ్తే ఎవరికైనా అనుమానం వస్తే దొరికిపోతాను కదా అనే భయం లేకుండా ఎందుకు పూల మొక్కలు చోరీ చేస్తున్నాడు అంటూ నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి : Snake In Cauliflower: కాలీఫ్లవర్‌లో పాము.. ఒళ్లు జలదరించే షాకింగ్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి