Uttar Pradesh Crime News: ఉదయం ఆలస్యంగా టీ చేసిందని భార్యను భర్త హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఉదయం టీ కోసం భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ పెద్దది కావడంతో కత్తితో భార్యను నరికి చంపేశాడు. భార్యపై కత్తితో మూడు నాలుగుసార్లు పొడచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యాడు. వివరాలు ఇలా.. భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫజల్‌గఢ్ ప్రాంతానికి చెందిన ధర్మవీర్ (55)కు భార్య సుందరీ దేవి (50), ముగ్గురు కుమారులు ఉన్నారు. ఉదయం భార్యను టీ అడిగాడు. సుమారు ఐదు నిమిషాల తర్వాత.. ధరమ్‌వీర్ మళ్లీ టీ అడిగాడు. అనంతరం టెర్రస్‌పై ఉన్న తాత్కాలిక వంటగదికి వద్దకు వెళ్లి ఆమెను టీ అడగ్గా.. టీ సిద్ధం కావడానికి మరో 10 నిమిషాలు పడుతుందని చెప్పింది. ఎందుకు లేట్ అయిందని భార్యతో గొడవకు దిగాడు ధర్మవీర్. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ధర్మవీర్ కత్తి తీసుకుని భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఆమె మెడపై మూడు నాలుగుసార్లు నరికాడు. ఓ కుమారుడు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. పక్కకు తోసేసి భార్యపై అటాక్ చేశాడు. కొడుకు చూస్తుండగానే భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. 


"మా నాన్నగారు తరచూ టీ తాగి గొడవలు పడేవాడు. రోజుకి కనీసం 5-6 సార్లు టీ తాగే అలవాటు ఉండేది. అమ్మ ఎప్పుడైనా టీ చేయడానికి నిరాకరించినా లేదా అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకున్నా.. ఆమెని గట్టిగా అరిచేవాడు. కానీ కొట్టడం నేనెప్పుడూ చూడలేదు. టెర్రస్‌పై ఆమె మృతదేహాన్ని చూసినప్పుడు మేము షాక్‌కు గురయ్యాం" అని బాధితురాలి కుమారులు తెలిపారు.


మోదీనగర్ ఏఎస్పీ జ్ఞాన్ ప్రకాష్ రాయ్ మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య టీ తయారీ విషయంలో గొడవ జరిగిందని తెలిపారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పాత పదునైన ఆయుధంతో భార్యను భర్త వెనుక నుంచి పొడిచి చంపాడని చెప్పారు. కుమారుడు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook