man molested Girl in howrah express while she went  to wash room in  midnight: మహిళలు, యువతులపై వేధింపుల ఘటనలు ఇటీవల ఆందోళనలను కల్గిస్తున్నాయి. ఇంట్లో నుంచి బైటకు వెళ్లిన వారు మరల ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆందోళన కల్గించే అంశంగా మారింది. ఈ క్రమంలో.. కామాంధులు పసిపాపల నుంచి పండు ముసలి వారి వరకు ఎవర్ని వదలడం లేదు. ప్రతిరోజు పదుల సంఖ్యలో అత్యాచారాలు, వేధింపులకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. గుడి,బడి, బస్టాంట్, రైల్వే స్టేషన్, మెట్రోలు .. ఇలా ప్రతిచోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు కొన్నిచోట్ల మరీ దారుణంగా కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవాళ్లే అత్యాచారాలకు పాల్పడుతున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మరికొందరు అన్యాయం జరిగిందని పోలీసు స్టేషన్ కు వెళితే అక్కడి కూడా వేధింపులకు చెందిన ఘటనలు జరుగుతున్నాయి. కొందరు పోలీసులు యువతుల్ని లైంగికంగా వేధిస్తున్నారు. మరోవైపు నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలున్న కూడా కామాంధుల్లో మాత్రం మార్పులు రావడంలేదు. ఈనేపథ్యంలో రన్నింగ్ ట్రైన్ లో యువతి పట్ల ఒక కామాంధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 


పూర్తి వివరాలు..



 యువతి హౌరా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుంది. ఇంతలో అర్ధరాత్రి పూట వాష్ రూమ్ కు వెళ్లేందుకు బైటకు వచ్చింది. ఆ తర్వాత మరల తన బెర్త్ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఒక కామాంధుడు ఆమెను చూశాడు. ఆమె దగ్గరకు వెళ్లి వెకిలి చేష్టలు వేశాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న వారంతా నిద్ర నుంచి మేల్కొని నిందితుడ్ని పట్టుకున్నారు. అతగాడు.. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు యువతిఆరోపించింది.


Read more: AP Cabinet: ముగ్గురు పిల్లలున్న వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ క్యాబినెట్.. డిటెయిల్స్ ఇవే..  


 యువతిని తాకుతూ.. పైశాచీకంగా ప్రవర్తించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 5 గంటలకు ట్రైన్ విశాఖపట్నం చేరుకొగానే పోలీసులు కామాంధుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ గా మారింది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter