AP Cabinet: ముగ్గురు పిల్లలున్న వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ క్యాబినెట్.. డిటెయిల్స్ ఇవే..

AP Local body elections: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో  భేటీ అయ్యారు.ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు, సహాకార సంఘాలు ఎన్నికల విషయంలో ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు పిల్లలున్న వారి విషయంలో.. సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 7, 2024, 04:40 PM IST
  • ఏపీ క్యాబినెట్ భేటీ..
  • ముగ్గురు సంతానం విషయంలో ఆసక్తికర పరిణామం..
AP Cabinet: ముగ్గురు పిల్లలున్న వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ క్యాబినెట్.. డిటెయిల్స్ ఇవే..

Ap cabinet new rule who have three children can also contest in local body elections: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాలనలో బిజీగా ఉంటున్నారు. ఒకవైపు ఏపీని గాడినపెట్టే పనులు చేస్తునే, మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఎలా వెనక్కి వెళ్లిపోయిందో శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారు.  అంతేకాకుండా.. పాలనలో ఎక్కడ కూడా రాజీ పడకుండా.. తన దైన స్టైల్ లో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఏపీలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలను వెలికి తీస్తున్నారు. ఇప్పటికే ఏపీలో వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సీఎం చంద్రబాబు కలెక్టర్ లకు కూడా పలుసార్లు సమావేశాలు నిర్వహించారు.

పాలనలో ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తిలేదని తెల్చిచెప్పారు. అంతేకాకుండా.. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలలో  అలసత్వం చూపే అధికారుల్ని మాత్రం వదిలేది లేదంటూ  కూడా తనదైన శైలీలో చంద్రబాబ్ గట్టిగానే చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం రోజున ఏపీ మంత్రి వర్గం భేటీ  జరిగింది. దీనిలో సీఎం చంద్రబాబు, మంత్రులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ముగ్గురు పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదివరకు ఉన్న.. ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత అనే నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తొలగిస్తున్నట్టుగా ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. ఎన్నికలకు ముందే.. నిబంధనను రద్దు చేస్తామంటూ కూటమి హామీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా.. 2014-19, 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై చర్చించారు. మత్స్యకారులకు నష్టం కలిగేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవో రద్దు కేబినెట్ రద్దు చేసింది.

Read more: Kantola Benefits: వర్షాకాలంలో మాత్రమే దొరికే బోడకాకర కాయ.. ఈ విషయాలు తెలిస్తే ఎగబడి తింటారు..

మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్  నిర్ణయం తీసుకుంది. నాటి సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ముగ్గురు పిల్లలున్న వారు ఎన్నికలలో పాల్గొనవచ్చని నిబంధన సవరించడంతో చాలా మంది పొలిటియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News