Man Murderd his Wife at Siliguri West Bengal: ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్ హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా అలాంటి దారుణమైన కేసు పశ్చిమ బెంగాల్ లో కూడా ఒకటి తెరపైకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త తన భార్యను హత్య చేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి మహానంద నదిలో పడేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి మృతదేహం కోసం పోలీసులు మహానంద నదిలో గాలిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి నివాసి రేణుకా ఖాతూన్ చాలా రోజులుగా కనిపించకుండా పోయింది. డిసెంబర్ చివరి వారంలో రేణుక కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సిలిగురి పోలీసులు రేణుకా ఖాతూన్ మిస్సింగ్ రిపోర్టును నమోదు చేసి, కేసును సీరియస్‌గా విచారించడం ప్రారంభించారు.


విచారణలో సిలిగురి పోలీసులకు అనుమానం వచ్చి ఆ అనుమానం రేణుక భర్త మహ్మద్ అన్సారుల్ వైపు మళ్లింది. ఎందుకంటే పోలీసుల విచారణలో అతను తన వాంగ్మూలాన్ని మారుస్తూ వచ్చాడు. సిలిగురి పోలీసులు అతన్ని తమదైన శైలిలో విచారించగా, అతను అవుట్ బరస్ట్ అయ్యి అసలు మొత్తం విషయమేమిటో బయట పెట్టారు. రేణుకను తానే హత్య చేసినట్లు విచారణలో అన్సరుల్ ఒప్పుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుకకు వేరే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు అన్సరుల్ కు అనుమానం కలిగింది. ఈ అనుమానంతోనే రేణుకను చంపాలని ప్లాన్ చేశాడు, డిసెంబర్ 24న రేణుకను అన్సారుల్ హతమార్చి, ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి మహానంద నదిలో పడవేశారు, ఇక రేణుక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేణుక మృతదేహం కోసం పోలీసులు గజ ఈతగాళ్లు సహాయం కూడా తీసుకుంటున్నారు. రేణుక కుటుంబం సిలిగురి దాదాభాయ్ కాలనీలోని వార్డు నంబర్ 43లో నివసిస్తోంది, ఆమెను ఏ విధంగానూ సంప్రదించ లేకపోవడం, అన్సారుల్ కూడా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వక పోవడంతో బంధువులు రేణుక మిస్సయినట్టు కంప్లైంట్ దాఖలు చేశారు.
Also Read: Thalapathy Vijay Divorce: భార్యకు విడాకులివ్వనున్న స్టార్ హీరో విజయ్.. అసలు విషయం ఏమిటంటే?


Also Read: Ghee From Animal Fat: తక్కువ రేటుకే నెయ్యి దొరుకుతుందని లొట్టలేస్తూ తింటున్నారా.. ఇది చదివితే ఇక ముట్టుకోరు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook