Married woman Affair With Man: ఆమెకి పెళ్లయింది. భర్త కూడా ఉన్నాడు. కానీ ఏవేవో విబేధాలతో భర్తకు దూరంగా ఉంటున్న ఆమె ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన 25ఏళ్ల యువకుడికి ఆకర్షితురాలైంది. అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆస్ట్రేలియాలో అతడితో రెండుసార్లు ఇష్టపూర్తిగా శృంగారంలో పాల్గొంది. చివరికి తనను పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన మాట తప్పాడంటూ అతడిపై కేరళ హై కోర్టులో రేప్ కేసు పెట్టింది. తాజాగా ఈ కేసుపై కేరళ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఇద్దరూ కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాతే శృంగారంలో పాల్గొన్నప్పుడు అది రేప్ కేసు ఎలా అవుతుందంటూ కేరళ హై కోర్టు ఆ కేసును కొట్టిపారేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కేరళ హై కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకరికొకరు పరస్పర అనుమతితో ఇష్ట పూర్తిగా లైంగిక సంబంధం పెట్టుకున్న తరువాత దానిని అత్యాచారం అంటే చట్టం అంగీకరించదని కోర్టు స్పష్టంచేసింది. అంతేకాకుండా అప్పటికే పెళ్లయిన సదరు మహిళ తన భర్త నుండి చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే మరొకరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు కనుక ఈ ఉదంతంలో అతడు మాట తప్పాడని తప్పుపట్టడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడింది. అతడు పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన మాటను వెనక్కు తీసుకున్నంత మాత్రాన్నే, అంతకంటే ముందుగా వారిద్దరి మధ్య ఏకాభిప్రాయంతో ఏర్పడిన లైంగిక సంబంధం అత్యాచారం కాదని.. ఒకవేళ అతడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా తప్పుడు ఉద్దేశంతోనే శృంగారంలో పాల్గొన్నాడని నిరూపిస్తే తప్ప అది అత్యాచారం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే అంశాన్ని కోర్టు ఒక్కినొక్కానించి మరీ చెప్పింది.


రేప్ కేసు పెట్టిన మహిళ గురించి కోర్టు స్పందిస్తూ.. నిందితుడితో స్వచ్ఛందంగానే ఆమె శృంగారంలో పాల్గొన్నట్టు ఫస్ట్ ఇన్ ర్మేషన్ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతోంది. అంతేకాకుండా తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడం చట్టబద్ధం కాదనే విషయం తెలిసి కూడా ఆమె అతడితో సంబంధం పెట్టుకున్నట్టు స్పష్టమవుతోందని కోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో నిందితుడి గురించి స్పందిస్తూ.. పెళ్లయిన మహిళను పెళ్లి చేసుకుంటానని నిందితుడు చేసిన వాగ్ధానం చట్టరీత్యా చెల్లదు కనుక ఐపిసి సెక్షన్ 376 కింద ఈ పిటిషన్ విచారణార్హం కాదని కోర్టు గుర్తుచేసింది. ఈ కేసులో పిటిషనర్ కి ఇప్పటికే పెళ్లయి ఉన్నందున.. చట్టరీత్యా కొత్తగా మరొక వ్యక్తితో పెళ్లి అనేదే సాధ్యపడదు అని జస్టిస్ కౌజర్ ఇడప్పగత్ పేర్కొన్నట్టు పిటిఐ కథనం పేర్కొంది.


Also Read : Extra Marital Affairs: వివాహేతర సంబంధం.. ప్రైవేట్ పార్ట్స్‌పై ఫెవిక్విక్ పోసి చంపాడు


Also Read : Aayushi Chaudhary Murder Case: వీడిన ఆయూషి చౌదరి మర్డర్ మిస్టరీ.. కిల్లర్స్ ఎవరో కాదు..


Also Read : Trending Video: పాపం.. ఒక చిన్న అక్షరం తప్పు.. దుత్త కాస్త కుత్తా.. అంటే కుక్కలా మారిపోయాడు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook