Gangrape in KV School Washroom: చిన్నారులకు పవిత్రమైన విద్యాలయంలోనూ రక్షణ లేదని మరోసారి నిరూపించిన ఘటన ఇది. అది కూడా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన బాలికలకు విద్యా సంస్థల్లో ఉన్న రక్షణపై అనేక సవాళ్లు లేవనెత్తుతోంది. స్కూల్ వాష్ రూమ్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో 11 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు సీనియర్లు స్కూల్ ఆవరణలోని టాయిలెట్ గదిలో గ్యాంగ్ రేప్ కి పాల్పడినట్టు ఫిర్యాదు అందడంతో ఢిల్లీ పోలీసులు గురువారం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూలై నెలలో చోటుచేసుకున్న ఈ దారుణం గురించి బాధితురాలు ఇటీవల మంగళవారమే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఢిల్లీ మహిళా కమిషన్ ద్వారా బాధితులు పోలీసులను ఆశ్రయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్కూల్ వాష్ రూమ్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ మహిళా కమిషన్.. ఢిల్లీ పోలీసులు, సదరు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ కి నోటీసులు జారీచేశారు. స్కూల్ ఆవరణలో జరిగిన ఈ నేరాన్ని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో వివరణ ఇవ్వాల్సిందిగా స్కూల్ ప్రిన్సిపల్ కు జారీచేసిన నోటీసుల్లో ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశించింది. 


ఇదిలావుంటే ఈ ఘటనపై స్పందించిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్).. బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్టుగా అసలు స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికే రాలేదని, పోలీసులు దర్యాప్తు చేపట్టిన తర్వాతే ఈ విషయం తెలిసిందని పేర్కొంది. అయితే, కేంద్రీయ విద్యాలయ రీజినల్ ఆఫీస్ మాత్రం ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించింది. 


స్కూల్ వాష్‌రూమ్‌లో మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసిన (Minor Girl Rape Case) ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఈ విషయం గురించి స్కూల్లో క్లాస్ టీచర్‌కి స్వయంగా బాధితురాలు చెప్పినప్పటికీ.. సదరు క్లాస్ టీచర్ ఆ వివాదాన్ని తొక్కిపెట్టినట్టు తెలిసిందని అన్నారు. అందుకే ఈ ఘటనలో స్కూల్ ప్రమేయంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని స్వాతి మలివాల్ అన్నారు. దురదృష్టవశాత్తుగా చిన్నారులకు విద్యా సంస్థల్లోనూ సరైన రక్షణ లేకుండాపోయిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.


Also Read : Prisoner, Call Girl: ఆస్పత్రి గదిలో వేశ్యతో పట్టుబడిన ఖైదీ.. ఆస్పత్రికి వెళ్లింది అందుకేనా ?


Also Read : Making Liquor from Medicines: మెడిసిన్స్ నుండి లిక్కర్ తయారీ చేస్తోన్న డాక్టర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి