Mumbai Fire Incident: ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు
Fire Accindet In Mumbai: ముంబైలో శుక్రవారం తెల్లవారుజామున ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయపడ్డారు. మంటల భారీగా వ్యాపించడంతో భవనంలోని నివాసితులు టెర్రస్‌పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Fire Accindet In Mumbai: ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గోరేగావ్‌లోని ఓ భవనంలో మంటల చెలరేగగా.. ఏడుగురు మృతి చెందగా.. 40 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం ఐదు అంతస్తుల భవనంలోని దిగువ అంతస్తులకే పరిమితమైంది. ఈ మంటల్లో పలు వాహనాలు, స్క్రాప్ మెటీరియల్ కూడా దగ్ధమయ్యాయి. పొగలు కమ్ముకోవడంతో ప్రజలు భవనం నుంచి బయటకు రాలేక టెర్రస్‌పైకి వెళ్లారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలోని నివాసితులు పై అంతస్తుల్లో చిక్కుకుపోయారని.. వారిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారిలో 36 మందిని హిందూహృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మెడికల్ కాలేజీ (హెచ్‌బీటీ) ఆసుపత్రికి తరలించగా.. 15 మంది కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు రోగులను సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు, ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
చీఫ్ ఫైర్ ఆఫీసర్ రవీంద్ర అంబుల్గేకర్ మాట్లాడుతూ.. 6.54 గంటల ప్రాంతంలో మంటలను పూర్తిగా ఆర్పివేసినట్లు తెలిపారు. 2006లో ఈ భవనాన్ని నిర్మించారని.. అగ్నిమాపక వ్యవస్థ లేదని తెలిపారు. ఎనిమిది ఫైర్ ఇంజన్లు, ఐదు జంబో వాటర్ ట్యాంకర్లు, మూడు ఆటోమేటిక్ టర్న్ టేబుల్స్, క్విక్ రెస్పాన్స్ వెహికల్, అంబులెన్స్‌ను సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించాయి.
ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. "ముంబైలోని గోరేగావ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. పోలీసు అధికారులతో మాట్లాడుతున్నాం. అన్ని సహాయక చర్యలు అందజేస్తాం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.." అని ట్వీట్ చేశారు.
Also Read: సెంచరీల మోత మోగించిన కాన్వే, రచిన్.. ఇంగ్లండ్‌పై కివీస్ ఘన విజయం..
Also Read: Breaking: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం.. లోక్ పోల్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి