Neredmet Gang Rape: కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి ఘోరం.. 12 ఏళ్ల బాలికపై 10 మంది రేప్
Culprits Arrest In Neredmet Girl Gang Rape: తెలంగాణలో అత్యంత పాశవికంగా 12 ఏళ్ల బాలికపై 10 మంది దుండగులు చెరబట్టారు. కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి బాలికకు తాగించి మృగాళ్లా దాడికి పాల్పడ్డారు.
Neredmet Gang Rape: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దోపిడీలు, నేరాలు, దొంగతనాలు, దాడులు పెరిగిపోతున్నాయి. మహిళలకు రక్షణ కరువవుతోంది. రక్షించాల్సిన పోలీసులే చెరబడుతుండడంతో రాష్ట్రంలో భయానక పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో నేరాల సంఖ్య నమోదవుతోంది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల కిందట నేరెడ్‌మెట్‌లో బాలికపై పాశవిక దాడి జరిగింది.
Also Read: Doctors Surgery: కాలికి గాయమైతే ప్రైవేటు పార్ట్‌కు శస్త్ర చికిత్స.. వైద్యుల ఘన కార్యం
తెలంగాణను ఉలిక్కిపడేలా చేసిన బాలిక హత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పాశవిక దాడికి కారణమైన నిందితులను అరెస్ట్ చేశారు. అయితే మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. బాలికపై జరిగిన సంఘటనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ సమయంలో వెలువడిన వాస్తవాలు విని పోలీసులే ఆశ్చర్యానికి లోనయ్యారు. నిందితుల అరెస్ట్ విషయమై పోలీసులు వివరాలు వెల్లడించారు.
Also Read: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
నేరెడ్‌మెట్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక కనిపించగానే కొందరు యువకుల కన్ను పడింది. బాలికకు మాయమాటలు చెప్పి గంజాయి కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు. కూల్‌డ్రింక్ తాగిన బాలిక గంజాయి మత్తులోకి జారుకుని అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం కిడ్నాప్ చేసి నిర్మానుష ప్రాంతంలో తీసుకువెళ్లారు. అక్కడ అత్యంత పాశవికంగా మొత్తం 10 దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక్కసారి కాకుండా పలుమార్లు చేయడంతో ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు గురయ్యింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నేరెడ్‌మెట్ పోలీసులు తీవ్రంగా గాలించారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ముఠాలోని 8 మంది సభ్యులు చిక్కారు. వారిలో కీలక సూత్రధారులైన నరేశ్, విజయ్ కూడా ఉన్నారు. అయితే మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మిగతా వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో నిందితులు చక్కోలు నరేశ్ (26), సిరిపంగ విజయ్ కుమార్ (23), గుడ్డాంటి కృష్ణ (22), తొంటె కిరణ్ కుమార్ (26), జేమ్స్ సేవియర్ (24), వగమరె దీపక్ (25), సబావత్ హత్య నాయక్ (25) ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter