Doctors Surgery: కాలికి గాయమైతే ప్రైవేటు పార్ట్‌కు శస్త్ర చికిత్స.. వైద్యుల ఘన కార్యం

Shocking Incident Doctors Perform Wrong Surgery To Boys Private Part: ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఊడినట్లు వైద్యులు కాలికి శస్త్ర చికిత్స చేయాల్సింది పోయి మర్మాంగానికి చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 29, 2024, 06:11 PM IST
Doctors Surgery: కాలికి గాయమైతే ప్రైవేటు పార్ట్‌కు శస్త్ర చికిత్స.. వైద్యుల ఘన కార్యం

Doctors Perform Wrong Surgery: వైద్యులు దేవుళ్లుగా భావిస్తుంటే కొందరి వైద్యుల తీరుతో వైద్య వృత్తికే కళంకం ఏర్పడుతోంది. కొందరు వైద్యులు తాజాగా వైద్య చికిత్సలో పొరపాటు చేశారు. ఫలితంగా పాలుడి ప్రాణానికే ముప్పు ఏర్పడింది. గాయం ఒకచోట జరిగితే సర్జరీ మరో చోట చేశారు. ఫలితంగా బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Tamanna Bhatia: పుస్తకాల్లో హీరోయిన్‌ జీవితం.. అందాలు ఆరబోసే తమన్నా మా పిల్లలకు ఆదర్శమా?

ఠాణె జిల్లా శహాపూర్‌కు చెందిన బాలుడు (9) గత నెలలో తన స్నేహితులతో ఆడుకుంటూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలో బాలుడి కాలుకి గాయమైంది. స్థానికంగా ప్రైవేటు వైద్యం తీసుకున్నా తగ్గకపోవడంతో శహాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలుడిని కుటుంబసభ్యులు చేర్పించారు. జూన్‌15వ తేదీన చేర్పించగా వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. కొన్ని రోజులకు బాలుడికి చికిత్స చేశారు. అయితే కాలుకు బదులు బాలుడి మర్మాంగ అవయానికి చేయడం విస్తుగొల్పింది. ఇది చూసిన కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురై వైద్యులను నిలదీశారు. పొరపాటును గ్రహించిన వైద్యులు ఈ విషయం బయటకు రాకుండా వెంటనే కాలుకి చికిత్స చేసి మమ అనిపించారు. 

Also Read: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..

 

ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి చివరకు బయటపడింది. ప్రభుత్వ వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విషయం తెలుసుకున్న జిల్లా సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ కైలాస్‌ పవర్‌ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అయితే వైద్యులు ఈ సంఘటనపై వివరణ ఇచ్చారు. బాలుడి కాలికి గాయమైన విషయం వాస్తవమేనని ఆస్పత్రి వైద్యాధికారి గజేంద్ర పవార్‌ తెలిపారు. మర్మాంగంలోనూ సమస్యను మేం గుర్తించి శస్త్ర చికిత్స అందించామని వివరించారు. కాలికి, మర్మాంగానికి రెండింటికి వైద్యం చేసినట్లు వివరణ ఇచ్చారు.

సమాచారం లేకపోవడం
ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు వైద్యులు చెప్పకపోవడంతో గందరగోళం ఏర్పడిందని చెప్పారు. కాగా ఈ సంఘటన సమాచారం తెలిసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. కాకపోతే విచారణ చేస్తున్నారు. సంఘటన పొరపాటున జరిగినా బాలుడికి సంబంధించిన రెండు సమస్యలకు వైద్యం అందించడంతో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రెండో సర్జరీ విషయం చెప్పకపోవడం వైద్యుల తప్పిదంగా తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News