NRI Woman: విదేశాల్లో సంపాదించిన డబ్బున్నంతా బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే బ్యాంక్‌ ఉద్యోగి మోసానికి పాల్పడ్డాడు. ఆమెను నమ్మించి వంచించాడు. ఆమెకు సంబంధించిన రూ.16 కోట్లు బ్యాంకు ఉద్యోగి కాజేశాడు. ఖాతాలో చూస్తే ఒక్క రూపాయి కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో బ్యాంక్‌ మేనేజర్‌ చేస్తున్న మోసాలు బయటపడ్డాయి. ఈ సంఘటన గురుగ్రామ్‌లో చోటోచేసుకుంది.  శ్వేతా శర్మ అనే మహిళ 2016లో భారత్‌కు తిరిగి వచ్చారు. అమెరికాలో తక్కువ వడ్డీ రేట్లు ఉండడంతో తన సంపాదనను భారత్‌లో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించుకుని గురుగ్రామ్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఆశ్రయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడి బ్యాంక్‌ అధికారుల సలహాతో శ్వేతా శర్మకు ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన ఎన్‌ఆర్‌ఈ ఖాతాను తెరిచారు. 2019 సెప్టెంబర్‌లో ఖాతా తెరచిన ఆమె డిసెంబర్‌ 2023 మధ్య నాలుగేళ్ల వ్యవధిలో తన సేవింగ్స్‌ను దాదాపు రూ.13.5 కోట్లు డిపాజిట్‌ చేశారు. నాలుగేళ్ల వ్యవధిలో ఇంత మొత్తం డిపాజిట్‌ చేయడంతో భారీగా వచ్చి ఉంటుందని ఆమె భావించారు. 5.5 శాతం నుంచి 6 శాతం వడ్డీ ఉంది. దీంతో అసలు, వడ్డీ కలిపి బ్యాంక్‌ ఖాతాలో రూ.16 కోట్లు ఉంటుందని ఆమె భావించారు. అయితే శర్మను మరో బ్యాంక్‌ ఉద్యోగి కలిశారు. అధిక వడ్డీ ఇప్పిస్తానని చెప్పారు. దీంతో తన నగదును వేరే ఖాతాకు తరలించేందుకు ఆమె ప్రయత్నించగా ఖాతాలో నగదు నిల్వలు లేవని తెలిసింది.


బ్యాంక్‌ మేనేజర్‌ ఫేక్‌ ఈమెయిల్‌ ఐడీ సృష్టించి, బ్యాంకు రికార్డుల్లో తన ఫోన్‌ నంబర్‌ను మార్చేసి మోసానికి పాల్పడ్డాడని గుర్తించారు. నకిలీ ఖాతాలు సృష్టించి, సంతకం ఫోర్జరీ చేసి డెబిట్‌ కార్డులు, చెక్‌లను అతడి పేరు మీద తీసుకున్నారని శ్వేతా శర్మ ఆరోపించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అధికారులకు ఆరు వారాల కింద ఫిర్యాదు చేశారు. మేనేజర్‌ మోసంపై బ్యాంక్‌ ఉన్నత అధికారులు తీవ్రంగా స్పందించారు. అతడిపై చర్యలు తీసుకున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. కేసు విచారణలో ఉందని చెప్పారు. తాత్కాలికంగా ఆమె ఖాతాలో రూ.9.27 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చినా ఇంతవరకు పరిష్కారం కాకపోవడంతో బాధితురాలు శ్వేతా శర్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి