Cyber Crime in Bengaluru: సైబర్ క్రైమ్ మోసాలపై అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. కొందరి తీరులో మార్పు రావడం లేదు. చదువులేని వారి కంటే.. ఉద్యోగాలు చేస్తున్నవారే ఆన్‌లైన్ కేటుగాళ్ల మాయలో పడి దారుణంగా మోసపోతున్నారు. తాజాగా OLX లో బెడ్‌ను విక్రయించేందుకు ప్రయత్నించి రూ.68 లక్షలు పోగొట్టుకున్నాడు ఓ టెక్కీ. బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల టెక్కీ ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ OLXలో తన వాడుకున్న బెడ్‌ను విక్రయించడానికి ప్రయత్నించి నిండా మోసపోయాడు. ఆదిష్ అనే బాధితుడు అనుకోకుండా తన మొబైల్‌కు వచ్చిన ఓటీపీని స్కామర్లకు షేర్ చేసి.. మూడు రోజుల్లో రూ.68 లక్షలు నష్టపోయాడు. ఈ సంఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన పాత బెడ్‌ను రూ.15 వేల ధరకు విక్రయించాలని ఇటీవల ఓఎల్‌ఎక్స్‌లో ఆదిశ్ పోస్ట్ చేశాడు. ఆ బెడ్ తాను తీసుకుంటున్నానని రోహిత్ శర్మ అనే ఓ వ్యక్తి సంప్రదించాడు. డిసెంబర్ 6న శర్మ బెడ్ కొనడానికి ఆసక్తి చూపాడు. ఫోన్‌లో ఆదిష్‌తో మాట్లాడాడు. డిజిటల్ యాప్ ద్వారా నగదు బదిలీ చేస్తానని  ఆదిష్‌కు రోహిత్ చెప్పాడు. అయితే డబ్బులు పంపించేందుకు ఆన్‌లైన్‌లో సమస్య ఉందని రోహిత్ అన్నాడు. తన యూపీఐ ఐడీ రూ.5 పంపించాలని కోరాడు.


5 రూపాయలకు బదులు రూ.10 పంపిస్తానని అన్నాడు. రూ.5 పంపించగా.. శర్మ ఆదిశ్‌కు రూ.10 తిరిగి సెండ్ చేశాడు. అనంతరం ఆదిశ్‌ను రూ.5 వేలు పంపించాలన్నాడు. రూ.5 వేలు పంపించగా.. రూ.10 వేలు తిరిగి చెల్లించాడు. ఆ తరువాత రూ.7,500 పంపాలని.. రూ.15 వేలు ఇస్తానని అన్నాడు. ఈ క్రమంలో రోహిత్ తాను పొరపాటున రూ.30 వేలు సెండ్ చేశానని ఆదిష్‌కు చెప్పాడు. తాను డబ్బులు వెనక్కి తీసుకుంటానని.. తన పంపించిన లింక్‌పై క్లిక్ ఓటీపీ ఎంటర్ చేస్తే.. తన అకౌంట్‌లో తన డబ్బులు వెనక్కి వస్తాయన్నాడు. 


అప్పటికే రోహిత్ డబ్బులు తనకు పంపించడంతో నమ్మిన ఆదిష్.. ఆ లింక్‌పై క్లిక్ చేశాడు. ఓటీపీని ఎంటర్ చేయగా.. అతని ఖాతాలో డబ్బులు కట్ అయ్యాయి. తాను తిరిగి పంపుతున్నానని.. కానీ టెక్నికల్ ఇష్యూ ఉందని రోహిత్ నమ్మించాడు. ఇలానే ఆదిష్‌ లింక్‌ను క్లిక్ చేస్తూ.. రూ.68 లక్షలు పొగొట్టుకున్నాడు. శర్మ మరింత డబ్బు డిమాండ్ చేస్తుండడంతో చివరికి తాను మోసపోయానని గుర్తించి.. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఆదిష్ ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు


Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి