KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్

KCR Discharge: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎడమ కాలి శస్త్ర చికిత్స నిమిత్తం వారం రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 15, 2023, 12:02 PM IST
KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్

KCR Discharge: ఇంట్లో బాత్రూంలో కాలు జారి పడటంతో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎడమ కాలు తుంటికి ఫ్రాక్చర్ అయింది వారం రోజులుగా హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరారు. 

తెలంగాణ ఫలితాలు వెల్లడైన నాలుగు రోజుల తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్ బాత్రూంలో కాలు జారి పడ్డారు దాంతో ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఆయనకు డిసెంబర్ 8న హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకునేందుకు 6-8 వారాలు పట్టవచ్చని యశోద వైద్యులు తెలిపారు. ఈసారి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాకుండా నందినగర్ పాత ఇంటికి వెళ్లడంతో ఆ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 

నందినగర్ పాత ఇంట్లో కేసీఆర్ దాదాపు తొమ్మిదిన్నరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత నందినగర్ పాత ఇంట్లో బస చేస్తున్నారు. 2000 సంవత్సరంలో ఈ ఇంటిని నిర్మించారు. 2021లో ఓసారి ఇంటిర మరమ్మత్తు పనులు పరిశీలించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ ఇంటి నుంచి కార్యాచరణ రూపొందించారు.కేసీఆర్ ఇంటికి వస్తున్నందున ఇంటిని పూలదండలతో అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు కుటుంబసభ్యులు. 

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జెడ్ ప్లస్ కేటగరీ భద్రను వై కేటగరీకు తగ్గించింది. 4 ప్లస్ 4 గన్‌మెన్‌లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనం మాత్రం కేసీఆర్ భద్రతకు ఉపయోగించనున్నారు. ఇంటి ముందు సెంట్రీ పహారా ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రత తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలుగా పరిమితమైన మాజీ మంత్రులకు 2 ప్లస్ 2 గన్‌మెన్‌లు ఉంచి ఎమ్మెల్యేలుగా లేనివారికి పూర్తిగా గన్‌‌మెన్‌లను తొలగించింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లకు కూడా తొలగించారు. 

Also read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News