Hyderabad Fake Baba: దెయ్యం పట్టిందంటూ యువతులకు దొంగ బాబా వల.. 8వ పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్
Fake Baba Arrested In Hyderabad: అతను ఇప్పటికే ఏడుగురును పెళ్లి చేసుకున్నాడు. దెయ్యం పట్టిందని అమ్మాయిలకు వల వేసేవాడు. ఆరోగ్యం బాగు అవ్వాలంటే తనతో పెళ్లి జరిపించాలని చెప్పేవాడు. 8వ పెళ్లికి రెడీ అవ్వగా.. ముహూర్త సమయానికి ముందు ట్విస్ట్ ఇచ్చాడు. పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు.
Fake Baba Arrested In Hyderabad: హైదరాబాద్‌లో దొంగ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. భూతవైద్యం పేరుతో ఇప్పటివరకు ఏడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ హైటెక్ బాబా.. 8వ పెళ్లికి ముందు పోలీసులకు దొరికిపోయాడు. లంగర్ హౌజ్‌లో దెయ్యం పట్టిందని నమ్మించి యువతులను లొంగదీసుకుంటున్న బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. 8వ పెళ్లికి అంతా సిద్ధం చేసుకుని రెడీగా ఉండగా ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లి మండపానికి ఎంతకు రాకపోవడంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిలాడీ బాబా బాగోతాలకు చెక్ పడింది. వివరాలు ఇలా..
నెల్లూరులోని రెహ్మతాబాద్ దర్గాకి చెందిన హఫీజ్ పాషా అనే వ్యక్తి బాబా అవతారం ఎత్తాడు. నిన్న రాత్రి 11 గంటలకు తబస్సుమ్ ఫాతిమా అనే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి కోసం 200 మంది బంధువులు ఫంక్షన్ హాల్‌కు వచ్చారు. ముహూర్తం సమయం దగ్గర పడుతున్నా పాషా మాత్రం ఇంకా పెళ్లి మండపానికి రాలేదు. అందరూ అతని కోసం ఎదురుచూసినా లాభం లేకుండా పోయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. హైటెక్ బాబాను అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు లంగర్ హౌజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. టోలిచౌకికి చెందిన ఫాతిమా మూడేళ్లుగా నెల్లూరు దర్గాలో చికిత్స తీసుకుంటోందని చెప్పారు. వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. యువతిని పెళ్లి చేసుకుంటానని బాబా చెప్పడంతో వాళ్లు నమ్మారని అన్నారు.హైదరాబాద్ టోలిచౌకి ఫంక్షన్ హాల్‌లో తబస్సుమ్ కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాని.. అయితే పెళ్లికి ముందు బాబా మొహం చాటేశాడని తెలిపారు. యువతి కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు బాబాను అరెస్ట్ చేశామన్నారు. అతడికి గతంలో ఏడు పెళ్లిళ్లు అయినట్లు యువతి బంధువులు చెప్తున్నారని వెల్లడించారు.
తన కూతురుకు అనారోగ్యాంగా ఉందని నెల్లూరుకు తీసుకువెళ్లామని పెళ్లికూతురు తండ్రి జహీర్ తెలిపారు. అక్కడ దొంగ బాబా తన కూతురిని ట్రాప్ చేశాడని.. అమ్మాయి ఆరోగ్యం మరింత క్షీణించిందని అన్నారు. బ్లాక్ మ్యాజిక్ చేశాడని తమకు అనుమానంగా ఉందని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని చెప్పారు. అతను చెప్పిన చోటే ఫంక్షన్ హాల్‌లోనే పెళ్లి ఏర్పాట్లు చేశామని.. పెళ్లి సమయం దాటిపోయినా బాబా రాలేదన్నారు. బాబా వయసు 54 ఏళ్లు.. తన కూతురుకు 18 ఏళ్లు ఉన్నాయని అన్నారు. పెళ్లి బంధనంతో అనారోగ్య సమస్యలు నయమతాయని చెప్పడంతో ఒప్పుకున్నామన్నారు.
Also Read: Bandi Sanjay: నూతన సచివాలయంపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. టూంబ్స్ కూల్చేస్తాం..
Also Read: Ind Vs Aus 1st Test: తోక ముడిచిన ఆసీస్.. ఇన్నింగ్స్ తేడా టీమిండియా భారీ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook