Police Raids Oyo Hotel: దేశ రాజధాని న్యూఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడా జిల్లాలో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ఓ హోటల్‌పై బుధవారం అర్థరాత్రి గౌతమ్‌బుద్‌నగర్ పోలీసులు దాడులు చేసి.. ఏడుగురు మహిళలను రక్షించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఓయో హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నోయిడా పోలీస్ స్టేషన్ సెక్టార్-39 పరిధిలోని దాద్రీ రోడ్డులోని సెక్టార్-41లోని ఓయో హోటల్‌లో బుధవారం రాత్రి వ్యభిచారం జరుగుతోందని పోలీసు కమిషనరేట్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే దాడులు నిర్వహించగా.. నిందితులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఏడుగురు మహిళలను వ్యభిచారం కూపం నుంచి రక్షించారు. వీరిని బలవంతంగా ఈ కూపంలోకి దించారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వీరి వెనుక ఎవరైనా ముఠా హస్తం ఉందా..? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఓయో హోటల్‌ను పోలీసులు సీజ్ చేశారు. హోటల్‌లో డ్రగ్స్‌తో సహా  దాదాపు 15 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. 


ఇటీవలె అందామైన అమ్మాయి ద్వారా అమాయకులకు గాలం వేసి మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అబ్బాయిలను ఆకర్షించి.. వారిని తమ రూమ్‌కు పిలుపించుకుంటారు. అనంతరం వారితో ఏకంతంగా గడిపేందుకు దుస్తులు విప్పిస్తారు. అదేసమయంలో నకిలీ పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. 


ఇటీవలో ఓ యువకుడితో తాను బ్యూటీ పార్లర్‌లో పని చేస్తున్న మసాజ్ గర్ల్‌గా పరిచయం చేసుకుంది. కొద్దిరోజులు చాట్ చేసుకున్న తరువాత ఇద్దరు కలుసుకోవాలని అనుకున్నారు. యువకుడిని తన రూమ్‌కు తీసుకువెళ్లిన యువతి.. లోపలికి వెళ్లిన తరువాత తలుపులు మూసివేసింది. ఏకంతంగా గడిపేందుకు యువకుడు దుస్తులు విప్పేయగా.. అదేసమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి తలుపులు తట్టారు. తాము పోలీసులం అని.. పోక్సో కేసులో అరెస్ట్ చేస్తున్నామని యువకుడిని బెదిరించారు. 


రూ.10 లక్షలు ఇస్తే వదిలేస్తామని చెప్పి కారులో తీసుకువెళ్లారు. బాధితుడు డబ్బు ఇస్తానని నిందితులను నమ్మించి కారులో నుంచి కిందకు దిగాడు. ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నిందితులను అరెస్ట్ చేశారు. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన యువతితో పాటు సహకరించిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు.


Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు  


Also Read: China Earthquake: చైనా సరిహద్దుల్లో భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి